Rushikonda Palace
Rushikonda Buildings : విశాఖ రుషికొండ భవనాల( rushikonda buildings) విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయలతో భారీ భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ భవనాలపై చాలా రకాల చర్చ నడిచింది. కానీ వినియోగం ఎలా అనేది ప్రభుత్వానికి కూడా ఆలోచన తట్టడం లేదు. ఈ తరుణంలో ఈరోజు మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఓసారి రుషికొండ భవనాలను సందర్శించాలని సూచించారు. అప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని మంత్రివర్గ సహచరులతో చెప్పినట్లు సమాచారం. ఈ భవనాల విషయంలో కోర్టు అభ్యంతరాలు ఉండడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయము తీసుకోలేకపోతున్నట్లు సమాచారం.
Also Read : వంగవీటి రాధాకృష్ణకు పిలుపు.. చంద్రబాబు కీలక నిర్ణయం!
* అన్నింటికీ సిద్ధపడిన వైసిపి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో విశాఖను పాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానికి సాంకేతిక చిక్కులు ఎదురు కావడంతో అధికారిక నిర్ణయం ఆలస్యం అయింది. అయితే అంతర్గతంగా మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ నుంచి పాలనకు సిద్ధపడింది. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈపాటికే విశాఖ నుంచి పాలనకు సంబంధించి కార్యకలాపాలు ప్రారంభం అయ్యేవి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రుషికొండ భవనాలు పూర్తయ్యాయి. ఆ భవనాలపై అధ్యయనం చేసిన అధికారుల బృందం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తో పాటు కీలక విభాగాధిపతులకు సంబంధించి అనుకూలంగా ఉన్నట్లు ధృవీకరించారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులకు అధికారికంగా కార్యాలయాల కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులు విశాఖలో అన్వేషించారు. చాలా రకాల భవనాలు గుర్తించారు. మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే రుషికొండ భవనాల్లో సీఎం క్యాంప్ కార్యాలయం.. విశాఖలో వివిధ ప్రాంతాల్లో మంత్రుల కార్యాలయాలు అందుబాటులోకి వచ్చి ఉండేవన్నమాట.
* పర్యాటక ల్యాండ్ మార్క్..
విశాఖ నగరంలో రుషికొండ భవనాలు ఒక ల్యాండ్ మార్క్ గా ( landmark) నిలిచేవి. రుషికొండ బీచ్ అనేది ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఉండేది. రుషికొండపై అనేక పర్యాటక శాఖకు చెందిన భవనాలు ఉండేవి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భవనాలను తొలగించింది. రిషికొండను బోడి గుండు కొట్టించింది. పోలీస్ భద్రత నడుమ అక్కడ నిర్మాణాలు చేపట్టింది. అయితే పర్యాటక నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఎటువంటి ఇతర నిర్మాణాలు చేపట్టకూడదు. దీనిపై కోర్టు అభ్యంతరాలు ఉన్నాయి. అనేక రకాల ఆదేశాలు ఉన్నాయి. అయినా సరే రహస్యంగా అక్కడ పవనాల నిర్మాణానికి పూనుకుంది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఆ నిర్మాణాలు ఎందుకో కూడా బయటపెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ అవి సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని.. వివిధ విభాగాధిపతుల కోసమేనని అంతర్గతంగా సంకేతాలు ఇచ్చింది. వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ భవనాల ప్రారంభానికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న ప్రారంభించడానికి చర్యలు చేపట్టలేదు.
* కూటమి వచ్చిన తర్వాత కదలిక..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రుషికొండ భవనాల విషయంలో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటివరకు ఉన్న పోలీసు భద్రతను తొలగించారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( Ghanta Srinivasa Rao ) నేతృత్వంలో కూటమి నేతలు రుషికొండ భవనంలోకి ప్రవేశించారు. అక్కడ ఖరీదైన నిర్మాణాలు, కట్టడాలు కనిపించాయి. ఆ విషయాలు బయటపడడంతో అదో సంచలన అంశాలుగా మారిపోయాయి. అటు తర్వాత సీఎం చంద్రబాబు సైతం రుషికొండ నిర్మాణాలను పరిశీలించారు. త్వరలో ఒక నిర్ణయానికి వస్తామని చెప్పుకొచ్చారు. కానీ 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వీటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి మంత్రులకు పరిశీలించమని ఆదేశించారు సీఎం. మంత్రుల పరిశీలన తరువాత దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read : అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. సింగపూర్ సడన్ ఎంట్రీ!