Ex Minister Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి రోజా ఒకరు. గత ఐదేళ్లుగా ప్రత్యర్థులపై టార్గెట్ చేయడంలో ఆమె తీరే వేరు. 2014లో తొలిసారిగా ఆమె నగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ వైసీపీ ఏర్పాటుకు ఆ పార్టీలో చేరి.. ఎమ్మెల్యేగా విజయం సాధించాలన్న తన కలను సాకారం చేసుకున్నారు.అయితే ఐదేళ్ల పాటు వైసీపీ విపక్షంలో ఉండిపోయింది. ఆ సమయంలో ఎంతో దూకుడు కనబరిచారు రోజా. జగన్ టీమ్ లో ముఖ్య నేతగా మారిపోయారు. నాడు అధికారపక్షం పై విరుచుకుపడే తీరు ఆకట్టుకుంది.అదే ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వేటుకు కారణమైంది.అయితే రోజా మాత్రం దూకుడు తగ్గించలేదు. అదే స్పీడ్ తో 2019 ఎన్నికల్లో నగిరి నుంచి రెండోసారి గెలిచారు. అక్కడి నుంచి రోజా వెను తిరిగి చూడలేదు. తొలి మంత్రివర్గంలో ఆమెకు చోటు దక్కలేదు. కానీ విస్తరణలో మాత్రం ఛాన్స్ ఇచ్చారు జగన్. అక్కడి నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. ఆపై వివాదాస్పదం అయ్యారు. బూతు నేతల సరసన చేరిపోయారు. అదే ఆమెకు ఇబ్బందిగా మారింది. వైసిపి దారుణంగా ఓడిపోయింది. రోజా నగిరి నుంచి భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో కొద్ది రోజులు పాటు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. స్థానికంగా కూడా కనిపించకుండా పోయారు.
* లడ్డూ వివాదం పై స్పందన
తాజాగా తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తెరపైకి వచ్చారు రోజా. ఈ విషయంలో సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. అసలు వైసీపీ ది తప్పు కాదన్నట్టు చెప్పుకొచ్చారు. తమ పార్టీని వెనుకేసుకొచ్చారు. అయితే పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని పరచు తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలకు వెళ్లడం ద్వారా రోజా తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్నారు. బ్రేక్ దర్శనాలతో ఆమె డబ్బులు దండుకున్నారని ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తిరుమల లడ్డు వివాదం పై మాట్లాడడం జనాల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. ఈ విషయంలో ఆమె మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* పోల్స్ లో వీక్
అయితే రోజా తనకు తాను అతిగా ఊహించుకున్నారు. లడ్డు వివాదం నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేశారు. తిరుమల ఎవరి హయాంలో మెరుగ్గా ఉందని.. లడ్డు విషయంలో ఎవరిది తప్పు అంటూ ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో పోల్స్ పెట్టారు. మెజారిటీ జనాలు చంద్రబాబుకు జై కొట్టారు. కనీస స్థాయిలో కూడా జగన్ ను సమర్ధించలేదు. ఈ పోల్ రిజల్ట్స్ కు సంబంధించి స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దెబ్బతో రోజా యూట్యూబ్ ఛానల్ ని మూసివేశారు. ఆపై మాట మార్చారు. అసలు తాను యూట్యూబ్ ఛానల్ లో లేనట్టు చెప్పుకొచ్చారు.
* అంతా వివాదాస్పద నేతలే
తిరుమలలో వ్యవహారంలో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. వైసీపీలోని సీనియర్లు ఎవరు నోరు మెదపడం లేదు. కనీసం మాట్లాడడం లేదు. దీంతో వైసిపి వివాదాస్పద నేతలే జగన్ కు అవసరం అయ్యారు. అందుకే కొడాలి నాని తెరపైకి వచ్చారు. ఆయనతోపాటు వల్లభనేని వంశీ కనిపించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సైతం స్పందించాల్సి వచ్చింది. కానీ ఒక్కరు కూడా పద్ధతి ప్రకారం మాట్లాడడం లేదు. తిరిగి జగన్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. ఏకంగా యూట్యూబ్ ఛానల్ లో పోల్స్ పెట్టి జగన్ పరువు తీశారు రోజా.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Roja defamed jagan by posting polls on the tirumala laddu controversy on youtube channel
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com