RK Weekend Voice Revealed: ప్రతి శనివారం సాయంత్రం ఏబీఎన్ లో వర్తమాన రాజకీయాలపై ఆ ఛానల్ ఎండి వేమూరి రాధాకృష్ణ వారాంతపు విశ్లేషణ చేస్తారు.. ఆ విశ్లేషణపై వీడియో బైట్ టెలికాస్ట్ అవుతుంది.. రాసేది రాధాకృష్ణ అయినప్పటికీ.. చదివేది మాత్రం ఒక లేడీ యాంకర్. ఆ వాయిస్ ఒక రకమైన గంభీరతను కలిగి ఉంటుంది. ఒక రకంగా వీకెండ్ కామెంట్ బై ఆర్కే కు ఆమె గొంతు ప్రాణం పోస్తుంది.. అయితే ఇప్పటివరకు ఆమె ఎవరు? అంతటి గంభీరతను సొంతం చేసుకున్న ఆమె నేపథ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం లభించలేదు. వేమూరి రాధాకృష్ణ వారాంతపు రాజకీయ విశ్లేషణ కు తెర వెనుక గొంతు ఇచ్చే మహిళ ఎవరో ఇన్నాళ్ళకు తెలిసింది.
వైసిపి అనుకూలమైన ఓ మహిళ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో వేమూరి రాధాకృష్ణ వారాంతపు రాజకీయ విశ్లేషణను చదివేది ఎవరో బయటపెట్టింది.. ఆ మహిళ పేరు మాత్రం బయట పెట్టలేదు. కాకపోతే ఆమె ఆ ఏబీఎన్ ఛానల్ నుంచి బయటికి వచ్చి యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అదే గంభీరతతో… అదే స్థాయిలో పెదవి విరుపుతో ఆమె మాట్లాడింది. కాకపోతే ఏబీఎన్ లో వాయిస్ బేస్ ఎక్కువగా ఉంటుంది. యూట్యూబ్లో మాత్రం కాస్త తక్కువగా ఉంది.. ఇన్నాళ్లకు వేమూరి రాధాకృష్ణ వారాంతపు రాజకీయ విశ్లేషణను చదువుతున్న మహిళ ఎవరో బయటకు తెలియడంతో ఒక్కసారిగా సస్పెన్స్ వీడిపోయింది. ఈ నేపథ్యంలో మహిళపై వైసీపీ అనుకూల నెటిజన్లు ఎదురు దాడికి దిగారు.. సోషల్ మీడియాలో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలు వేస్తున్నారు.
Also Read: KA Paul Nimisha Priya Case: కేఏ పాల్ అడుగుపెట్టాడు.. యెమెన్ లో నిమిష ప్రియకు ఉరిశిక్ష ఆగిపోయిందట..
ఆమె గొంతు అంత బాగోలేదని.. వాంతులు విరోచనాలు వచ్చే విధంగా ఉందని.. ఇటువంటి మహిళకు వేమూరి రాధాకృష్ణ వారాంతపు రాజకీయ విశ్లేషణను చదివే అవకాశం ఎలా ఇచ్చారని చాలామంది మండిపడుతున్నారు.. టిడిపి అనుకూలంగా వేమూరి రాధాకృష్ణ వారాంతపు రాజకీయ విశ్లేషణ ఉంటుందని.. ఆ చెత్త పలుకు మాదిరిగానే ఈమె గొంతు కూడా ఉందని వైసీపీ అనుకూల నెటిజన్లు ఆరోపిస్తున్నారు.. ” వేమూరి రాధాకృష్ణ వారాంతపు రాజకీయ విశ్లేషణ లో పస ఉండదు. విషయం కూడా ఉండదు. కానీ ఏదో ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. ఈమె గొంతు ఇంకా పెద్ద మైనస్ పాయింట్. ఆయనప్పటికీ ఎన్ని సంవత్సరాల పాటు ఆమె చదివింది అంటే మామూలు విషయం కాదు.. ఇన్నాళ్లకు అలా చదివేది ఎవరో తెలిసిపోయింది. ఆయన ఇలాంటి వాళ్లే అలాంటి వీకెండ్ కామెంట్స్ చదువుతుంటారని” వైసిపి అనుకూల నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
కొందరేమో ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు..” ఆమె గొంతు బాగుంది కాబట్టే ఏబీఎన్ లో ఉద్యోగం ఇచ్చారు. ఏకంగా వేమూరి రాధాకృష్ణ రాసే వారాంతపు రాజకీయ విశ్లేషణను చదివే అవకాశం కల్పించారు. మేనేజ్మెంట్ డబ్బులు ఇస్తోంది కాబట్టి ఆమె చదువుతోంది. ఆమె గొంతులో పస ఉంది కాబట్టి మేనేజ్మెంట్ ఉద్యోగం వచ్చింది. మధ్యలో మీకెందుకు.. మీరు ఏమైనా జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నారా.. అనవసరంగా ఒక మహిళను కించపరచాల్సిన అవసరం లేదు. మీకు రాధాకృష్ణతో ఏదైనా గెట్టు పంచాయతీ ఉంటే తేల్చుకోండి. అంతేతప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఒక మహిళ ఆత్మ అభిమానాన్ని దెబ్బకొట్టకండి” అంటూ నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
నువ్వేనా తల్లి ABN వీకెండ్లో చెప్పేది… pic.twitter.com/J80f2XoXWI
— Anitha Reddy (@Anithareddyatp) July 16, 2025