Homeఆంధ్రప్రదేశ్‌RK kotta paluku: మోడీని పడగొట్టేందుకు.. జగన్ బొద్దింకలను ముద్దాడేందుకు.. ఆర్కే బయటపెట్టిన సంచలనం

RK kotta paluku: మోడీని పడగొట్టేందుకు.. జగన్ బొద్దింకలను ముద్దాడేందుకు.. ఆర్కే బయటపెట్టిన సంచలనం

RK kotta paluku: ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ స్టైల్ వేరే విధంగా ఉంటుంది. చాలామంది ఆయన విమర్శిస్తారు కానీ, కొన్ని సందర్భాలలో ఆయన ఇన్ సైడ్ విషయాలను ఎటువంటి మొహమాటం లేకుండా చెబుతుంటారు. తన పత్రికలో ఎటువంటి ఫిల్టర్లు లేకుండా రాసుకుంటూ వస్తారు. చంద్రబాబు ప్రస్తావన లేకుంటే.. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రాయాల్సిన అవసరం లేకుంటే.. స్వేచ్ఛగా రాసుకుంటూ వెళ్తారు. తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ సంచలన విషయాలను బయట పెట్టారు. ఇందులో నరేంద్ర […]

RK kotta paluku: ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ స్టైల్ వేరే విధంగా ఉంటుంది. చాలామంది ఆయన విమర్శిస్తారు కానీ, కొన్ని సందర్భాలలో ఆయన ఇన్ సైడ్ విషయాలను ఎటువంటి మొహమాటం లేకుండా చెబుతుంటారు. తన పత్రికలో ఎటువంటి ఫిల్టర్లు లేకుండా రాసుకుంటూ వస్తారు. చంద్రబాబు ప్రస్తావన లేకుంటే.. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రాయాల్సిన అవసరం లేకుంటే.. స్వేచ్ఛగా రాసుకుంటూ వెళ్తారు.

తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ సంచలన విషయాలను బయట పెట్టారు. ఇందులో నరేంద్ర మోడీ పదవికి వచ్చిన ముప్పును.. జగన్ కొనసాగిస్తున్న డబుల్ పాలిటిక్స్ ను రాధాకృష్ణ బయటపెట్టారు.. రాధాకృష్ణ రాసుకొచ్చిన కొత్త పలుకు వ్యాసంలో అనేక సంచలమైన విషయాలున్నాయి. అందులో ప్రధానంగా మన దేశాభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు.. మనదేశంలో అత్యంత బలంగా ఉన్న రాజకీయ నాయకత్వాన్ని బలహీనం చేసేందుకు విదేశీ శక్తులు కుట్రలు పన్నాయని ఆర్కే చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే కూడా బయటపెట్టారు. ఈ కుట్రకు సరిగా కొద్ది రోజుల క్రితమే అంకురార్పణ జరిగింది. నాడు ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ ఖడ్ విదేశీ శక్తులతో చేతులు కలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేశారు. పైగా అమెరికా శక్తులు అనిల్ అంబానీని తమకు అనుకూలమైన వ్యక్తిగా ఎంచుకున్నాయి. అటు జగదీప్.. ఇటు అనిల్ అంబానీ కార్యాచరణ మొదలుపెట్టారు. నాడు టిడిపి.. జెడియు.. చిరాగ్ పాశ్వాన్.. అరవింద్ కేజ్రివాల్ వంటి వారు సహకరిస్తే మోడీ ప్రభుత్వం పతనమవుతుందని ఒక అంచనాకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అనుకున్నారు. ఈ దశలో జగదీప్ కొన్ని రాజకీయ పార్టీలతో ప్రాథమికంగా చర్చలు జరిపారట. అనిల్ అంబానీ కూడా దీనికి సహకరించారట.

ఒక దశలో చంద్రబాబు నాయుడు ను కలవడానికి అనిల్ అంబానీ అనేకసార్లు ప్రయత్నాలు చేశారట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. అయితే జేడీయూ అధినేత నితీష్..ఆప్ అధినేత కేజ్రీవాల్ ను మాత్రమే అనిల్ అంబానీ కలుసుకున్నారట. మోడీకి వ్యతిరేకంగా ఏదో జరుగుతుందని చంద్రబాబు తెలుసుకొని.. ఈ విషయాన్ని నితీష్.. చిరాగ్ పాశ్వాన్ వంటి వారికి చెప్పారట. కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి రాజీనామా చేయాలని కోరితే జగదీప్ చేయాల్సి వచ్చింది అట.

మరోవైపు ఇప్పటికిప్పుడు జగన్ బొద్దింకలను ముద్దు పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు వేరే ఉన్నాయి. అక్రమాస్తుల కేసులు ఆయనను కేంద్ర దర్యాప్తు సంస్థ రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. సిబిఐ కేసులతోపాటు ఈ డి కేసులతో కూడా రోజువారీగా విచారణ జరిగితే జగన్ ఇబ్బంది పడక తప్పదు. అవినీతి కేసుల నుంచి ఇప్పటికిప్పుడు తనకు రక్షణ లభించదనే అభిప్రాయానికి జగన్ వచ్చారు. అందువల్లే ఆయన రాజకీయంగా సపోర్ట్ కోసం బొద్దింకగా మారారు. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టినప్పటికీ ప్రయోజనం లభించే అవకాశం లేకపోవడంతో, కాక్రోచ్ జనతా పార్టీకి జగన్ సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా జగన్ చేసిన ట్వీట్ కు సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వారు చేసే ఫండింగ్ ద్వారానే ఉద్యమాలు జరుగుతున్నాయని కూడా విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో జగన్ లాంటి అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న నాయకులకు సిజెపి సపోర్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం..

తాజా వ్యాసంలో ఇన్ని రకాల సంచలన విషయాలను రాధాకృష్ణ వెల్లడించారంటే మామూలు విషయం కాదు. పైగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంది బిజెపి ఎంపీలు ఉన్నప్పటికీ.. ఈ విషయం తెలియదా.. ఒకవేళ తెలిసినా వారు నిశ్శబ్దంగా ఉండిపోయారా.. రాధాకృష్ణ లాంటివాళ్ళు ఆ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానం పక్కన పెడితే.. రాధాకృష్ణ రాసిన వ్యాసం మాత్రం బిజెపికి బూస్ట్ లాగా ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  రాహుల్ గాంధీని పదేపదే ప్రధానమంత్రిని చేస్తానని చెబుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడానికి విదేశీ శక్తుల సహాయం తీసుకున్నారని స్వయంగా రాధాకృష్ణ రాసుకొచ్చారు. మరి దీనిని రేవంత్ రెడ్డి ఎలా టాకిల్ చేస్తారు.. రాధాకృష్ణ దానికి కౌంటర్ ఎలా ఇస్తారు..వేచి చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper