RK Kotha Paluku (1)
RK Kotha Paluku: మొత్తానికి ఏపీ రాజకీయాలు మద్యం చుట్టూ తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో జరిగిన మద్యం వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెరపైకి తేవడంతో ఒక్కసారిగా సంచలనం నమోదయింది. మరోవైపు కాకినాడ పోర్ట్ యాజమాన్యం చేతులు మారడానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కారణమని విజయసాయిరెడ్డి చెప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇవే విషయాలను ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ (vemuri Radhakrishna) తన కొత్త పలుకు(kottapaluku)లో ప్రస్తావించడం విశేషం.
విజయసాయిరెడ్డి చెప్పిన మాటలు మాత్రమే కాకుండా.. తనకున్న సమాచారంతో వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో అనేక సంచలన విషయాలు పేర్కొన్నారు.. నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో జరిగిన మద్యం కొనుగోళ్లు.. అందులో చోటు చేసుకున్న అక్రమాలను రాధాకృష్ణ ప్రముఖంగా ప్రస్తావించారు.. సత్య ప్రసాద్ అనే అధికారి త్వరలో వాంగ్మూలం ఇస్తారని.. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో పూర్వ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా, కెసిఆర్ కుమార్తె కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మద్యం కుంభకోణాలు చోటుచేసుకున్నాయని..ఇవన్నీ ఒక తీరు అయితే.. ఏపీలో మద్యం కుంభకోణం మరో స్థాయిలో ఉందని రాధాకృష్ణ రాస్కొచ్చారు. పదివేల కోట్ల వరకు చేతులు మారిందని.. ఈ కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించారని.. విజయ సాయి రెడ్డి చెబితే.. చెప్పినట్టు సొమ్ములు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లాయని రాధాకృష్ణ సొంత భాష్యం చెప్పారు. రజత్ భార్గవ సీనియర్ ఐఏఎస్ అధికారి జగన్ మోహన్ రెడ్డి చేసిన మద్యం కుంభకోణానికి సహకరించారని.. ఏపీ బ్రూవరీస్ కార్పొరేషన్ ను ప్రైవేట్ సంస్థ లాగా నడిపారని.. భారతి సిమెంట్స్ లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన మనుషులతో మద్యం అమ్మకాలను పర్యవేక్షించే వారిని.. అతని మనుషులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించే వాళ్ళని.. ఇలా రకరకాల విషయాలను రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. అసలు జగన్ అంటే కోపం.. పైగా ఇలాంటి విషయాలు తెరపైకి రావడంతో వేమూరి రాధాకృష్ణ ఈ ఆదివారం కొత్త పలుకులో ఒంటి కాలు మీద లేచారు.
తర్వాత గొడ్డలి పెట్టు విజయసాయిరెడ్డి పైనే..
అధికారాన్ని కోల్పోవడానికి ముందు విజయ సాయి రెడ్డిని మద్యం వ్యవహారం నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించారట. వాటాల విషయంలో తేడాలు రావడం వల్ల తాడేపల్లి ప్యాలెస్ సూచనల మేరకు ఆయనను తప్పించారట. ఇప్పుడు విజయ సాయి రెడ్డి వైసీపీ లో లేరు కాబట్టి.. మద్యం కుంభకోణం లో మరిన్ని వివరాలను బయటపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. సిట్ అధికారులు విజయ సాయి రెడ్డిని విచారణకు పిలుస్తారని.. వారి ముందు విజయసాయి రెడ్డి నోరు విప్పుతారని ఆర్కే తన సొంత భాష్యాన్ని వెల్లడించాడు. ఈ విషయంలో విజయ సాయి రెడ్డి ఆఫ్రూవర్ గా మారతారని వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు లో పేర్కొన్నారు. అంతే కాదు వైయస్ రాజశేఖర రెడ్డి సొంత సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డిని గొడ్డలి వేటుతో చంపేసిన వారికి విజయసాయి రెడ్డి ఒక లెక్క కాకపోవచ్చని.. ఈ విషయంలో చంద్రబాబు విజయసాయిరెడ్డికి భద్రత కల్పించాలని రాధాకృష్ణ కోరారు. అంటే నిన్నటిదాకా విజయసాయి రెడ్డి పై చిందులు తక్కిన రాధాకృష్ణ ఒక్కసారిగా ఇలా రాయడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే జగన్మోహన్ రెడ్డి మద్యం విధానాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు కాబట్టి విజయసాయిరెడ్డి ఇప్పుడు రాధాకృష్ణకు మంచోడు అయిపోయాడు అనుకుంటా.. అన్నట్టు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన రాధాకృష్ణ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు కావస్తోంది.. మరి ఇన్ని రోజుల్లో ఈ కేసు కు సంబంధించి దర్యాప్తులో ఒక అడుగు కూడా ఎందుకు ముందుకు పడలేదు? సునీత ఆవేదనను ఎందుకు తీర్చడం లేదు? ఈ ప్రశ్నలకు ఏమైనా సమాధానం చెప్పగలరా.. వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో తెలిసినప్పుడు.. రాధాకృష్ణ చంద్రబాబుకు చెప్పొచ్చు కదా. వివేకానందను చంపిన నిందితులకు శిక్ష పడేలా చేయవచ్చు కదా.. “వివేకానంద రెడ్డి ని చంపిన వాళ్ళు.. విజయసాయి రెడ్డిని చంపరని గ్యారెంటీ ఏంటి” ఇలాంటివి పేపర్లో రాయడానికి బాగానే ఉంటాయి.. వాటిని నిరూపించాలనే కష్టం.. ఈ విషయం రాధాకృష్ణకు తెలియదా.. తెలిసినా కూడా కావాలని రాస్తున్నాడా.!?
Also Read: నిజమైన జర్నలిస్టులు ఎవరో తేల్చాలి.. తప్పుడు కథనాలు రాసే నాన్ జర్నలిస్టులు క్రిమినల్సే..!