Kiara Advani Blessed with a baby girl: పాన్ ఇండియా లెవెల్లో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కియారా అద్వానీ(Kiara Advani) కచ్చితంగా ఉంటుంది. ఈమె మన తెలుగు ఆడియన్స్ కి భరత్ అనే నేను చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది కానీ, ఆ తర్వాత తెలుగు లో ఆమె రామ్ చరణ్ తో కలిసి చేసిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి. తెలుగు లో ఆమె పెద్దగా సక్సెస్ రేట్ ని చూడలేకపోయింది కానీ, హిందీ లో ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, అగ్ర హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. అలా సినిమాలు చేస్తూనే ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) తో ప్రేమలో పడి 2023 వ సంవత్సరం లో పెళ్లి చేసుకుంది.
Also Read: సోషల్ మీడియా లో పిచ్చ నా కొడుకులు ఎక్కువగా ఉన్నారు – నిర్మాత నాగవంశీ
గత కొద్ది నెలల క్రితమే తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకున్న కియారా అద్వానీ, నిన్న తాను ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెల్పింది. పాపకు సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేయలేదు. సినీ సెలబ్రిటీలలో అలియా భట్ తప్ప, ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా తమ పిల్లలను మీడియా కి చూపించలేదు. చిన్న పిల్లలపై నరదిష్ఠి పడుతుంది అనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తుంటారని అంటుంటారు పెద్దలు. కియారా అద్వానీ చూసేందుకు దేవకన్య లాగా ఉంటుంది, సిద్దార్థ్ మల్హోత్రా కూడా ఇండియా లో టాప్ అందగాళ్ళలో ఒకడు. వీళ్లిద్దరి కలయిక లో పుట్టిన పాప ఎంత అందంగా ఉండుంటుందో మీరే ఊహించుకోండి. పాప తల్లి పోలికతో పుట్టిందా?, లేక తండ్రి పోలికతో పుట్టిందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా కియారా అద్వానీ తన పాపని చూపిస్తుందా లేదా అనేది.
Also Read: 150 అనాధాశ్రమాలను దత్తత తీసుకున్న మెగా కోడలు ఉపాసన కొణిదెల!
ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రాబోతున్న ‘వార్ 2’ లో హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ లో ఆమెకు సంబంధించిన షాట్స్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో రీసెంట్ గా ఈ టీజర్ ని ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఒక థియేటర్ లో కియారా అద్వానీ ఉన్న షాట్ కి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కనిపించిన షాట్స్ కంటే అద్భుతమైన రెస్పాన్స్ రావడాన్ని చూసి ఈమెకు యూత్ లో ఇంతమంచి క్రేజ్ ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తో పాటు ఆమె కన్నడ స్టార్ హీరో యాష్ తో కలిసి ‘టాక్సిక్’ అనే చిత్రం చేసింది. వచ్చే ఏడాది మార్చ్ నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.