https://oktelugu.com/

మైక్రోసాఫ్ట్ కి బిల్ గేట్స్ రాజీనామా..!

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ ఆ సంస్థనుంచి తప్పుకున్నారు. మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డుకు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో గ్లోబల్ హెల్త్, విద్య వంటి సామాజిక సేవలకు వినియోగించే ఉద్దేశంతో ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా బిల్ గేట్స్ కొనసాగనున్నారు. 2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌ టైం పనికి కూడా గుడ్‌ బై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 14, 2020 / 12:07 PM IST
    Follow us on

    మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ ఆ సంస్థనుంచి తప్పుకున్నారు. మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డుకు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో గ్లోబల్ హెల్త్, విద్య వంటి సామాజిక సేవలకు వినియోగించే ఉద్దేశంతో ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా బిల్ గేట్స్ కొనసాగనున్నారు.

    2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌ టైం పనికి కూడా గుడ్‌ బై చెప్పారు. 2014లో ఆయన మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ పదవినుంచి కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే.

    అక్టోబర్ 28, 1955 న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌ లో ఒక ధనవంతులు కుటుంబంలో బిల్ గేట్స్ జన్మించాడు. చిన్నతనం నుండే లెక్కలు, సైన్స్ అంటే చాలా ఇష్టపడే బిల్ గేట్స్ కాలేజీ చదువు అనంతరం కంప్యూటర్ లాంగ్యేజి అయిన బేసిక్ (BASIC) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్‌ కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి విక్రయించాడు. అలా బిల్ గేట్స్ ప్రయాణం మొదలయ్యింది. సాఫ్ట్ వేర్ శక్తిని ప్రజాస్వామ్యీకరించే ఉద్దేశంతో బిల్ గేట్స్ 1975లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి దాన్ని ప్రపంచ నెంబర్‌ వన్‌ స్థాయికి తీసుకెళ్లారు. 1995 నుండి 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు బిల్ గేట్స్. 2007 లెక్కల ప్రకారం బిల్ గేట్స్ ఆస్తి విలువ 58 బిలియన్ డాలర్లు. సామాజిక బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.