
దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా.. తెలంగాణాలో కూడా తన ఉనికిని చాటుకుంటోంది. దేశంలో తొలి కేసు తెలంగాణ వాసిది కావడం అదే విధంగా తొలి కరోనా మరణం కూడా హైదరాబాద్ లో 10రోజుల నివాసమున్న ఉన్న ఒక వ్యక్తిది కావడం మరియు ఓ యువకుడికి కరోనా వైరస్ వచ్చి తగ్గినా.. తెలంగాణ ప్రజలలో కరోనా భయం మరింతగా పెరిగింది.
దింతో రాజ్‌భవన్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రజలు సమూహాలుగా ఉండొద్దని ఆ శాఖ కోరింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్‌భవన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తిరిగి ఎప్పుడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సమావేశాలు మొదలయ్యేదీ ప్రస్తుతానికి చెప్పలేదు.