Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Real Estate: రియల్ బూమ్.. హైదరాబాద్ కు రెండింతల్లో 'అమరావతి'

Amaravati Real Estate: రియల్ బూమ్.. హైదరాబాద్ కు రెండింతల్లో ‘అమరావతి’

Amaravati Real Estate: అమరావతి( Amaravati capital ) రాజధాని పై నెలకొన్న సందిగ్ధత వీడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో ఇప్పటివరకు ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో దానికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఢిల్లీ వెలుపల.. కేంద్ర కార్యాలయాలన్నీ అమరావతిలో ఒకచోట నిర్మించనుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ భరోసా కూడా అమరావతికి దక్కింది. దీంతో అందరి చూపు ఇప్పుడు అమరావతిపై పడింది. పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా అమరావతిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగసిపడింది. గెజిట్ విడుదలైన గంటల వ్యవధిలోనే భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Also Read: ఢిల్లీ వెలుపల భారీ పవర్ సెంటర్ గా ‘అమరావతి’

* అప్పట్లో అంత ధరలే..
వాస్తవానికి 2024 జూన్ లో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం( Alliance government) . అధికారం చేపట్టింది కూడా. అప్పటినుంచి అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ భూముల ధర విషయానికి వచ్చేసరికి మాత్రం ఆశించిన స్థాయిలో పెరుగుదలలేదు. కానీ చట్టబద్ధత పొందిన తరువాత అమరావతిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. యాడాది కాలంలో చూస్తే ఒక చదరపు గజం ధర పదివేల నుంచి 50 వేలకు చేరింది. గత ఏడాది నర్త ప్రాంతంలో భూమి ధర గజం 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు అది 35 వేల నుంచి 40 వేల వరకు పెరిగింది. రాజధాని సమీపంలోని మండలాల్లో కూడా పొలాలకు, స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. 50 నుంచి 100% వరకు ధర పెరిగింది. అయితే సామాన్యులకు ఇది ఇబ్బందికర పరిస్థితి.

మున్ముందు అమరావతిలో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అనరాక్( unrac ) నివేదిక ప్రకారం అమరావతిలో రియల్ బూమ్ హైదరాబాద్ కంటే రెండింతలు ఉంటుందని ఒక అంచనా. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోనే కాకుండా గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, బాపట్ల వరకు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలో 15 బ్యాంకుల కార్యాలయాల భవనాలతో పాటు SRM, VIT యూనివర్సిటీలు విస్తరించే పనిలో పడ్డాయి.
* BITS క్యాంపస్, XLRI నేషనల్ లా యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించాయి. త్వరలోనే ఆసుపత్రులు, ప్రైవేటు కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన భవన నిర్మాణం ఏకకాలంలో జరగనుంది. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ రావడంతో రాజధాని ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అందరిలోనూ ఇదే ఆలోచన వస్తుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. భూముల విక్రయాలు సైతం పెరిగాయి.
* దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి కూడా ఇటువంటి చట్టబద్ధత లేదు. అమరావతిని ప్రత్యేకంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టబద్ధత కల్పించడంతో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా విస్తరించే ఛాన్స్ కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version