Homeఆంధ్రప్రదేశ్‌Amaravati vs Naya Raipur Comparison: అమరావతితో నయా రాయ్ పూర్ పోలిక... మీ కడుపు...

Amaravati vs Naya Raipur Comparison: అమరావతితో నయా రాయ్ పూర్ పోలిక… మీ కడుపు మంట తగలెయ్య

Amaravati vs Naya Raipur Comparison: అమరావతిని( Amravati capital ) అడ్డుకోవాలి. అమరావతి పై విషప్రచారం చేయాలి. అమరావతి విషయంలో ఎవరికీ క్రెడిట్ దక్కకుండా చేయాలి. ఏపీ రాజకీయాల్లో ఒక వర్గం చేసే ప్రయత్నం ఇది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపంలో అమరావతికి ఎప్పుడు వ్యతిరేక భావం ఉండనే ఉంది. మరోవైపు విశ్లేషకులు, ఎనలిస్టులు, కుహనా మేధావులు ఉండనే ఉన్నారు. వారి ప్రయత్నం సఫలం కాలేదు. ఎందుకంటే అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించింది. ఎంత వ్యతిరేకించిన ఆగదు కూడా అమరావతి. అయితే ఇప్పుడు సరికొత్త విష ప్రచారాలతో ముందుకు వస్తోంది అమరావతి వ్యతిరేక బృందం. చత్తీస్గడ్ రాజధాని నయా రాయపూర్ 20 సంవత్సరాలు దాటినా అభివృద్ధి చెందలేదని.. అమరావతి ఎలా అభివృద్ధి చెందగలదని ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే నయా రాయపూర్ కు, అమరావతిని ఒకే గాడిలో కట్టి చూడలేం. ఆ విషయం తెలియక ఏవేవో పిచ్చి విశ్లేషణలతో ప్రజలను గందరగోళంలో నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

* అక్కడ కేవలం కార్యాలయాలే..
అమరావతి రాజధాని అనేది ఎంపిక చేసిన ప్రాంతం. భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వృద్ధి అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల పరంగా చూస్తే రాయపూర్ తో( Raipur) అమరావతిని అస్సలు పోల్చలేం. అమరావతిని రాయిపూర్ తో పోల్చుతూ కేవలం ఒక పాలన నగరంగా చూడడం ఎంత మాత్రం సహేతుకం కాదు. రాయపూర్ రాజధాని ప్రాజెక్టును తీసుకుంటే అక్కడ కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలకి ప్రాధాన్యమిచ్చారు. పెట్టుబడులను ఆహ్వానించే పని చేయలేదు. పారిశ్రామిక ప్రణాళికలు అమలు చేయలేదు. కనీసం యువతకు ఉపాధినిచ్చే ఐటి పరిశ్రమలను సైతం రాలేదు. ఆ ప్రయత్నాలు అక్కడ కనీస స్థాయిలో కూడా జరగలేదు. గత దశాబ్దాలుగా అక్కడ నక్సలైట్ల ప్రభావం ఎక్కువ. అందుకే పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రాలేదు. అటువంటి నయా రాయిపూర్ తో అమరావతిని పోల్చడం పగదు కూడా.

* పాలనా రాజధాని మాత్రమే కాదు…
అమరావతి అనేది రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు. అదో వాణిజ్య ప్రాంతం కూడా. కేవలం పాలన కోసం వచ్చిన వారే కాదు. హైదరాబాద్ మాదిరిగా పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వీలుగా అమరావతిలో కీలక ప్రాజెక్టులను పెడుతున్నారు. పైగా రైలుతోపాటు రవాణా కనెక్టివిటీ ఉంది. ఒకవైపు విజయవాడ మహానగరం.. ఇంకోవైపు గుంటూరు నగరం ఉంది. ఆ రెండు నగరాలతో దీనిని అనుసంధానం చేయనున్నారు. వర్తక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దశాబ్దాలుగా వేలకోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రైల్వేల పరంగా ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం, కృష్ణానది ఒడ్డున ఉండడం, సహజ సిద్ధమైన పర్యాటక ప్రాంతం కావడం, చరిత్ర చెప్పుకునేందుకు వీలుగా అమరావతి పేరు పెట్టడం వంటివి ఏపీ రాజధాని కి కలిసి వచ్చే అంశాలు. అమరావతిలో పెట్టే ప్రతి పెట్టుబడికి మార్కెట్, రవాణా రూపంలో విజయవాడ, గుంటూరు నగరాలు అందుబాటులో ఉన్నాయి.

* ప్రపంచ సంస్థలే నిదర్శనం..
అమరావతిని నయా రాయిపూర్ తో పోల్చడం ఎంత మాత్రం సహేతుకం కాదు. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ప్రపంచ బ్యాంక్ తో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అప్పులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అన్ని పరిస్థితులను అంచనా వేసుకుని మాత్రమే అవి నిధులు సర్దుబాటు చేస్తాయి. ఐటీతోపాటు బయో టెక్నాలజీ, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చేలా ఇక్కడ ప్లాన్ చేశారు. ఇటువంటి ప్రయత్నాలు అప్పట్లో నయా రాయిపూర్ విషయంలో కనీస స్థాయిలో కూడా జరగలేదు. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండడం, పోర్టులకు సమీపంలో ఉండడం వంటివి అమరావతికి కలిసి వచ్చే అంశాలు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ఒకే ప్రాంగణంలో ఉండనున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలు, యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యాపరంగా కూడా మెరుగైన స్థితిలో ఉండనుంది అమరావతి. అయితే ఇప్పుడు అమరావతిని నయా రాయిపూర్ తో పోల్చడం వెనుక కడుపు మంట స్పష్టంగా కనిపిస్తోంది. అటువంటి విశ్లేషణల వెనుక ఉన్న రాజకీయ కుట్ర, ప్రేరేపితం ఇట్టే తెలిసిపోతుంది కూడా..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version