Site icon OkTelugu

Amaravati Outer Ring Road: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో బిగ్ అప్డేట్

Amaravati Outer Ring Road

Amaravati Outer Ring Road

Amaravati Outer Ring Road: అమరావతిలో( Amravati capital ) పెండింగ్ పనులు పట్టాలెక్కుతున్నాయి. చట్టబద్ధత కల్పించిన తర్వాత కీలక నిర్మాణాలకు మోక్షం కలుగుతోంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించి డిపిఆర్ సిద్ధమయింది. ఏపీ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ 17 ఇంటర్ చేంజ్ లను ప్రతిపాదించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రెండు ఇంటర్ చేంజ్ లు కావాలని కోరడంతో అనుమతించారు. దీంతో మొత్తం 19 ఇంటర్ చేంజ్ లు రానున్నాయి అన్నమాట. ఈ ఔటర్ రింగ్ రోడ్డు అనేది అమరావతికి మణిహారం. దూరప్రాంత జిల్లాలకు మరింత దగ్గర చేస్తుంది.

Also Read: వైభవ్ సూర్య వంశీ.. వరల్డ్ క్రికెట్ సెన్సేషన్ ఊరికే అవలేదు.. దాని వెనుక కన్నీళ్లు పెట్టించే త్యాగం

* ఆ నాలుగు జిల్లాలను కలుపుతూ..
అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ దాదాపు 193 కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్డు( Outer Ring Road) విస్తరించనుంది. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలను కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. వాహనాలు ప్రవేశానికి.. బయటకు వచ్చేందుకు అవకాశం ఉండదు. అందుకే 19 చోట్ల ఇంటర్ చేంజ్ ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు క్రాస్ చేసి దగ్గర ఇంటర్ చేంజ్ లను ప్రతిపాదించారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కోల్కత్తా- చెన్నై నేషనల్ హైవే 16 తో పాటు మచిలీపట్నం- విజయవాడ- హైదరాబాద్ హైవే ను రెండు చోట్ల క్రాస్ చేసేలా ప్లాన్ చేశారు.

* వాహనాల
క్రాసింగ్ కు అవకాశం
ఇంటర్ చేంజ్ వద్ద వాహనాలను క్రాస్ చేసుకోవచ్చు. మొదటి ఇంటర్ చేంజ్ కంచికచర్ల దగ్గర ఓఆర్ఆర్ మొదలయ్యే చోట విజయవాడ- హైదరాబాద్ నేషనల్ హైవే లో ఉంటుంది.
* రెండో ఇంటర్ చేంజ్ పొన్నవరం సమీపంలో వస్తుంది.
* మూడో ఇంటర్ చేంజ్ దుగ్గిరాలపాడు దగ్గర విజయవాడ- ఖమ్మం- నాగపూర్ ఎకడమిక్ కారిడార్ లో వస్తుంది.
* నాలుగో ఇంటర్ చేంజ్ మైలవరానికి దగ్గరలో.. విజయవాడ నుంచి భద్రాచలం, రాయిపూర్, జబల్పూర్ మీదుగా ఉత్తరాఖండ్లోని శీతర్గంజ్ వర్కు వెళ్లే హైవేలో వస్తోంది.
* ఐదో ఇంటర్ చేంజ్ బోధన పల్లి దగ్గర విజయవాడ నుంచి నూజివీడు వైపు వెళ్లే దారిలో వస్తుంది.
* ఆరో ఇంటర్ చేంజ్ అగిరిపల్లి దగ్గర విజయవాడ నుంచి నూజివీడు వెళ్లే రోడ్డులో వస్తుంది.
* ఏడో ఇంటర్ చేంజ్ పొట్టిపాడు దగ్గర కోల్కత్తా- చెన్నై జాతీయ రహదారికి సమీపంలో వస్తుంది.
* ఎనిమిదో ఇంటర్ చేంజ్ వెన్నూతల దగ్గర గన్నవరం నుంచి ఉంగటూరు మీదుగా హనుమాన్ జంక్షన్ వెళ్లే రోడ్డు దగ్గర వస్తుంది.
* తొమ్మిదో ఇంటర్ చేంజ్ మానికొండ దగ్గర కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో రానుంది.
* పదో ఇంటర్ చేంజ్ చలివేంద్రపాలెం- బావులూరు మధ్యలో మచిలీపట్నం – విజయవాడ హైవే లో వస్తుంది.
* 11వ ఇంటర్ చేంజ్ నందివెలుగు దగ్గర గుంటూరు నుంచి తూములూరు వెళ్లే రోడ్డులో రానుంది.
* 12వ ఇంటర్ చేంజ్ తెనాలి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నేషనల్ హైవేలో కాజా వర్క్ నిర్మించే రోడ్డు వద్ద ప్లాన్ చేస్తున్నారు.
* 13వ ఇంటర్ చేంజ్ నేషనల్ హైవే 16 లో నారా కోడూరు నుంచి బుడంపాడు దగ్గర రోడ్డులో రానుంది.
* 14వ ఇంటర్ చేంజ్ కె ఎస్ ఆర్ ఇంజనీరింగ్ సమీపంలో రానుంది.
* 15వ ఇంటర్ చేంజ్ పుల్లడిగుంట దగ్గర గుంటూరు ప్రత్తిపాడు రోడ్డులో రానుంది.
* 16వ ఇంటర్ చేంజ్ లింగయ్య పాలెం దగ్గర కోల్కత్తా చెన్నై హైవేలో ప్లాన్ చేస్తున్నారు.
* 17వ ఇంటర్ చేంజ్ మేడికొండూరు దగ్గర అనంతపురం- గుంటూరు హైవేలో రానుంది.
* 18 వ ఇంటర్ చేంజ్ బలుసు పాడు దగ్గర పెదకూరపాడు నుంచి అమరావతికి వెళ్లే దారిలో ప్లాన్ చేశారు.
* 19వ ఇంటర్ చేంజ్ కాజ దగ్గర రోడ్డులో రానుంది.

Exit mobile version