Margadarshi case : మార్గదర్శి కేసు.. ఈనాటిది కాదు. దశాబ్ద కాలంగా ఈ కేసు నానుతూనే ఉంది. మార్గదర్శి సంస్థ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా వేలకోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించారని ఆరోపిస్తూ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటినుంచి కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి.కానీ తుది తీర్పు మాత్రం రావడం లేదు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మొదటికి వస్తోంది ఈ కేసు. మరోవైపు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మార్గదర్శి ఎండి రామోజీరావు ఇటీవల మృతి చెందారు.దీంతో ఈ కేసు విషయంలో పిటిషనర్ వెనక్కి తగ్గుతారని అంతా భావించారు.కానీ అలా జరగలేదు.ఈ కేసు విషయంలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ స్పందించింది.తన వాదనను తెలియజేసింది.మార్గదర్శి ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిపాజిట్లు సేకరించడం పై విచారణ కొనసాగించాల్సిందేనని ప్రత్యేక అఫీటవిట్లో ఆర్బిఐ స్పష్టం చేసింది. ఆర్.బి.ఐ యాక్ట్ లోని సెక్షన్ 45 వర్తిస్తుందని కూడా చెప్పింది. హిందూ అవిభక్త కుటుంబ వ్యవస్థలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించడం చట్ట వ్యతిరేకమని కుండబద్దలు కొట్టింది. మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరడం ఇప్పుడు విశేషం. ఉండవెల్లి అరుణ్ కుమార్ దశాబ్ద కాలంగా దీనిపై పోరాడుతున్నారు. కానీ కొద్ది నెలల కిందట అధికారంలో ఉన్న జగన్ దీనిపై పట్టు బిగించారు. సిఐడి విచారణకు సైతం ఆదేశించారు. ఏపీ సిఐడి రామోజీరావు తో పాటు శైలజ కిరణ్ ను సైతం విచారణ చేపట్టింది.
*విచారణ జాప్యం
రాష్ట్రంలో అధికార మార్పిడి, రామోజీరావు మరణం వంటి కారణాలతో కేసు విచారణ స్లో అయ్యింది. అయితే ఈ కేసునిలబడుతుందా? లేదా? అన్న వాదనలు కొనసాగాయి. కానీ సరిగ్గా ఇటువంటి తరుణంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శి డిపాజిట్లను తప్పుపడుతూ.. విచారణ కొనసాగాలని కోరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తప్పకుండా ఈ కేసు ముందుకు సాగుతుందని ఈ పరిణామంతో తెలుస్తోంది.
* ఆ యాప్ వర్తించదని
చిట్ఫండ్ డిపాజిట్ల సేకరణ విషయంలో ఆర్బిఐ యాక్ట్ తమకు వర్తించదని మార్గదర్శి క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. దీనిపై ఆర్బిఐ కౌంటర్ దాఖలు చేసింది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం పై విచారణను కొనసాగించాల్సిందేనని అఫీడవిట్లో పేర్కొంది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు సేకరించడం చట్ట వ్యతిరేకమని కూడా స్పష్టం చేసింది. మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలని కూడా హైకోర్టును ఆర్బిఐ కోరింది.
* నేరం రుజువైతే శిక్ష
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రామోజీరావు ఉన్నారు. మార్గదర్శి వ్యవస్థాపకుడిగా ఆయనపై కేసులు ఉన్నాయి. మరోవైపు అక్రమంగా డిపాజిట్లు సేకరణ విషయంలో నేరం రుజువైతే మార్గదర్శి డైరెక్టర్లకు శిక్ష పడే అవకాశం ఉంది. రెండు నుంచి ఐదు ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2008లో మార్గదర్శి అక్రమ డిపాజిట్ లపై రాజమండ్రి ఎంపీగా ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసు హైకోర్టు విచారణలో ఉంది. ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కానీ ప్రధాన నిందితుడు రామోజీరావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.