https://oktelugu.com/

Lavanya Tripathi: మెగా ఫ్యామిలీ కి దూరంగా లావణ్య త్రిపాఠి..త్వరలో సంచలన ప్రకటన చేయబోతున్న వరుణ్ తేజ్!

లావణ్య త్రిపాఠి అంత కచ్చితంగా చెప్పిందంటే వీళ్ళ మధ్య మనం అనుకుంటున్నది ఏమి జరగడం లేదని అభిమానులు సైతం నమ్మారు. కానీ సరిగ్గా ఏడాదికి వీళ్లిద్దరు పెళ్లిపీటలు ఎక్కి కూర్చున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 17, 2024 / 05:12 PM IST

    Lavanya Tripathi

    Follow us on

    Lavanya Tripathi: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంట. వీళ్లిద్దరి పెళ్లి అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు బయట ఎక్కువగా కలిసి తిరిగినట్టు అనిపించలేదు. అలాగే పెళ్ళికి ఏడాది ముందు సోషల్ మీడియా లో మీరిద్దరూ ఇలా ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయని, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చెప్పాల్సిందిగా లావణ్య త్రిపాఠి ని యాంకర్ అడగగా, దానికి లావణ్య సమాధానం ఇస్తూ ‘మెగా ఫ్యామిలీ లో నాకు చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వరుణ్ తేజ్ నాకు మంచి స్నేహితుడు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నాకు ఇంకా మంచి స్నేహితులు, నిహారిక నాకు జిమ్ ఫ్రెండ్, నేను తనని చెల్లి లాగ చూస్తాను. వరుణ్ తో నాకు అంత వరకు మాత్రమే సంబంధం ఉంది, మీరు అనుకుంటున్నట్టు మేము ప్రేమించుకోవడం లేదు ‘ అంటూ సోషల్ మీడియా లో వచ్చిన ఆ వార్తలను కొట్టి పారేసింది.

    లావణ్య త్రిపాఠి అంత కచ్చితంగా చెప్పిందంటే వీళ్ళ మధ్య మనం అనుకుంటున్నది ఏమి జరగడం లేదని అభిమానులు సైతం నమ్మారు. కానీ సరిగ్గా ఏడాదికి వీళ్లిద్దరు పెళ్లిపీటలు ఎక్కి కూర్చున్నారు. దీంతో లావణ్య ని అందరూ ఎంత బాగా నటించావు తల్లీ అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేసారు. ఇకపోతే వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని నవంబర్ 1 తో సరిగ్గా ఏడాది అవుతుంది. అయితే లావణ్య త్రిపాఠి త్వరలో మెగా ఫ్యామిలీ ని వదిలి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అయితే వాస్తవానికి ఇది ఒక శుభ వార్త. ఎందుకంటే లావణ్య త్రిపాఠి ఇప్పుడు గర్భం దాల్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది. ఏ ఆడపిల్ల అయిన గర్భం దాల్చిన కొన్నాళ్ళకు పుట్టింటికి వెళ్లి , కాన్పు అయ్యే వరకు తల్లిదండ్రుల సమక్షంలో ఉంటారు. అది మన సంప్రదాయం. లావణ్య త్రిపాఠి కూడా అదే చేయబోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాతనే ఆమె వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుంది. ఖాళీ సమయం దొరకడంతో ఆమె బిడ్డకి జన్మని ఇవ్వడానికి అంగీకరించింది. త్వరలోనే మెగా ఫ్యామిలీ మరో చిట్టి పాప,లేదు బాబు అరుపులు వినిపించబోతున్నాయి అన్నమాట. ఏడాది క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్లిన్ కారా కి జన్మనిచ్చారు. ఈ పాప పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ లో అన్నీ శుభాలే జరుగుతున్నాయి. ఇప్పుడు త్వరలో అడుగుపెట్టబోతున్న వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి దంపతుల సంతానం కారణంగా ఇంకెన్ని శుభాలు మెగా ఫ్యామిలీ చూడబోతుందో చూడాలి.