Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కాస్త వెటకారం ఎక్కువే. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసే అరాచకం అంతా ఇంతా కాదు. ఇటీవల సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. పొలిటికల్ గా కీలక అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ లను టార్గెట్ చేస్తుంటారు. తాజాగా ఆ ముగ్గురిపై మార్ఫింగ్ ఫోటోలతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ సైతం ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రకు సంబంధించి విజయోత్సవ ర్యాలీకి పవన్ హాజరు కానున్నారు. చంద్రబాబు నేరుగా ఆహ్వానించడంతో రేపు జరిగే సభకు పవన్ హాజరు కావడానికి సమ్మతించారు. ఈ నేపథ్యంలో ఆర్జీవి పోస్ట్ చేసిన రెండు ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు ఉండగా.. మరో ఫోటోలో చంద్రబాబు చంకనెక్కిన పిల్లాడిలా పవన్ ఉండడం గమనార్హం. వాస్తవానికి ఆ రెండు ఫోటోల్లో ఉన్న ఒరిజినల్ వ్యక్తి లోకేష్ కుమారుడు దేవాన్ష్. ఆ ఫొటోలో పేస్ ను పవన్ కళ్యాణ్ ఫేస్ తో మార్నింగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఫొటోలను రాంగోపాల్ వర్మ తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు పోస్ట్ చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి కొన్ని వివాదాస్పద ట్విట్లను ఆర్జీవి అర్ధరాత్రి సమయంలో పోస్ట్ చేస్తుంటారు. తాను వాడ్కా మూడో పెగ్గు లోనో, నాలుగో పెగ్గు లోను ఉండగా పోస్ట్ చేసినట్లు చెబుతుంటారు. కానీ ఈసారి మాత్రం ఈ ఫొటోలను మధ్యాహ్న సమయంలో పోస్ట్ చేయడం గమనార్హం.