RGV : చంద్రబాబు ఆర్థికవేత్త ముందు మహేష్, తారక్, రాంచరణ్ వేస్ట్ అట..

ఇటీవల కాలంలో  టీడీపీ, ఆ పార్టీ అనుకూల మేధావులు, ఎల్లో మీడియాకు ఆర్జీవీ కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. వైసీపీ కంటే ప‌దునైన కౌంట‌ర్లు ఆర్జీవీ నుంచి రావ‌డం గ‌మ‌నార్హం. 

Written By: Dharma, Updated On : May 12, 2023 5:33 pm
Follow us on

RGV : ఈ మధ్యన దర్శకుడు రాంగోపాల్ వర్మ వైసీపీ అధికార ప్రతినిధిగా మారిపోయారు. జగన్ సర్కారుపై ఈగ వాలనివ్వడం లేదు. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చివరికి ఆర్థిక రంగ నిపుణులు సైతం విడిచిపెట్టలేదు. ఇటీవల ఆర్థిక నిపుణుడు జీవీరావు ఓ ఇంటర్వ్యూలో జగన్ సర్కారు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అస్తవ్యస్తమైపోతుందని చెప్పుకొచ్చారు.  ఆర్థిక వ్యవస్థపై  ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, అప్పలతో శ్రీలంక తరహాలో ఆర్థిక మాంధ్యమం ఎదురవుతోందని హెచ్చరించారు. రాష్ట్రంలో అస్తవ్యస్థ పాలన సాగుతుందంటూ ఇచ్చిన ఇంటర్వ్యూ తెగ వైరల్ అయ్యింది. ఎల్లో మీడియా అయితే పతాక శీర్షికన కథనాలను వండి వార్చింది.దాన్నే తాటికాయంత అక్ష‌రాల‌తో ఈనాడు ప‌త్రిక ముద్రించ‌డంతో రాజ‌కీయ దుమారం రేపింది. దీంతో రాంగోపాల్ వర్మకు జీవీరావు టార్గెట్ అయ్యారు. ఓ రేంజ్ లో ఆయన్ను ఆర్జీవీ అడేసుకున్నారు. ట్విట‌ర్ వేదిక‌గా సెటైర్స్ వేశారు. జీవీరావును ఓ క‌మెడియ‌న్‌గా చిత్రీక‌రిస్తూ వివిధ రూపాల్లో ఆయ‌న్ను ఆవిష్క‌రించడం విశేషం.

జీవీరావు ఆర్థిక నిపుణుడు. మంచి పేరున్న వ్యక్తి. దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్లేషణలు చేస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలు ఆయన ఇంటర్య్యూలను ప్రసారం చేస్తుంటాయి. సాక్షి మీడియాలో సైతం వ్యాపార వార్తల్లో జీవీరావుకు అగ్రస్థానం ఇచ్చిన సందర్భాలున్నాయి. అయితే మొన్న ఆ మధ్యన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏటో పోతోందని విమర్శించారు. దీనికి ఎల్లో మీడియా ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. ఈనాడు అయితే పతాక శీర్షికన కథనాలను ప్రచురించింది. ఇది ప్రభుత్వానికి ప్రతికూలతలు వచ్చేలా వైరల్ అయ్యాయి. కానీ వైసీపీ నేతలెవరూ దీనిపై స్పందించేందుకు సాహసించలేదు. కానీ రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ గా స్పందించడం విశేషం.  జీవీరావుకు ఆర్జీవీ చాలెంజ్ విసిరారు. క‌నీసం ప‌ది శాతం ద‌మ్మున్నా తాను నిర్వ‌హిస్తున్న డిబేట్‌కు రావాల‌ని జీవీరావును ఆయ‌న కోర‌డం గ‌మ‌నార్హం.

అయితే ఈ ఇష్యూలో చంద్రబాబును కూడా ఆర్జీవీ లాగారు. జీవీరావును పెద్ద స్టార్ గా చంద్రబాబు మార్చేస్తారంటూ సెటైర్లు వేశారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రాంచరణ్ అంతటి స్టార్లుగా జీవీరావును మార్చగల ఆర్థికవేత్త చంద్రబాబు అంటూ ట్విట్ చేశారు. అంతటితో ఆగకుండా ట్విస్టుల మీద ట్విస్టులు పెడుతునే ఉన్నారు. జీవీరావు డ్యాన్స్ చేస్తున్న‌ట్టు క్రియేట్ చేసిన వీడియో ఆక‌ట్టుకుంటోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మధ్య ఫన్నీ కామెంట్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో  టీడీపీ, ఆ పార్టీ అనుకూల మేధావులు, ఎల్లో మీడియాకు ఆర్జీవీ కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. వైసీపీ కంటే ప‌దునైన కౌంట‌ర్లు ఆర్జీవీ నుంచి రావ‌డం గ‌మ‌నార్హం.