KTR, Jagan, Chandrababu: కేటీఆర్, జగన్, చంద్రబాబు ఇంట రాఖీ పండుగ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లలో రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా మణులు సోదరులకు రాఖీ కడుతూ దీవెనలు అందజేశారు. జీవితాంతం తోడుంటామని అన్న చెల్లికి ప్రమాణం చేయడం తెలిసిందే. తెలుగు ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమి వేడుకల్లో ప్రముఖులతోపాటు సామాన్యులు సైతం తమ సోదరీమణులతో ఆనందంగా గడిపారు. అక్కా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు అందరు సరదాగా వేడుకలు జరుపుకున్నారు. శ్రావణ పూర్ణిమ రోజు వచ్చే రాఖీ బంధన్ ను అందరు ఘనంగా జరుపుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. […]

Written By: Srinivas, Updated On : August 22, 2021 6:00 pm
Follow us on

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లలో రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా మణులు సోదరులకు రాఖీ కడుతూ దీవెనలు అందజేశారు. జీవితాంతం తోడుంటామని అన్న చెల్లికి ప్రమాణం చేయడం తెలిసిందే. తెలుగు ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమి వేడుకల్లో ప్రముఖులతోపాటు సామాన్యులు సైతం తమ సోదరీమణులతో ఆనందంగా గడిపారు. అక్కా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు అందరు సరదాగా వేడుకలు జరుపుకున్నారు. శ్రావణ పూర్ణిమ రోజు వచ్చే రాఖీ బంధన్ ను అందరు ఘనంగా జరుపుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

తెలంగాణలో మంత్రి కేటీఆర్ కు మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టి తమ సోదర భావాన్ని తెలిపారు. తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రాఖీలు కట్టారు. కేటీఆర్ కు రాఖీలు కట్టిన వారిలో మంత్రులు సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాఖీలు కట్టారు. హుజురాబాద్ లో మహిళా ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్ రావుకు రాఖీ కట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుుమార్ కు రాజహిత బ్రహ్మకుమారి సోదరీమణులు రాకీ కట్టారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు ఆయన సోదరి శకుంతల రాఖీ కట్టారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుఆయన సోదరి శ్రీదేవి రాఖీ కట్టింది.

ఆంధ్రప్రదేశ్ లోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. తాడేపల్లి గూడెం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాఖీ వేడుకల్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యేలు ఆర్ కే రోజా, విడదల రజని, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, కళావతి, నాగులాపల్లి ధనలక్ష్మి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.టీడీపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా తన స్వగృహంలో రాఖీ వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబుకు రాఖీ కట్టారు.

వైఎస్ జగన్, షర్మిల రెండు స్టేట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రాజకీయ పార్టీలకు అధినేతలు. కుటుంబ ఒక్కటే అయినా ఎవరి దారి వారిదే. రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. రాఖీ వేడుకల్లో ఇద్దరు కలిసి వేడుకల్లో పాల్గొంటారో లేదో తెలియడం లేదు. తండ్రి ఆశయ సాధన కోసం ఇద్దరు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరు ఇద్దరి రాజకీయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నారు.