https://oktelugu.com/

KGF2 Release Date: కేజీఎఫ్2 రిలీజ్ డేట్ ఇదే.. ప్రభాస్ తో ఫైట్

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన మూవీ ‘కేజీఎఫ్’. దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రం ‘కేజీఎఫ్2’. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపించి సంచలన హిట్ అయ్యింది. ఈ చిత్రంతో హీరో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతోంది. కేజీఎఫ్2 కొత్త రిలీజ్ డేట్ ను మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2021 / 06:05 PM IST
    Follow us on

    కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన మూవీ ‘కేజీఎఫ్’. దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రం ‘కేజీఎఫ్2’. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపించి సంచలన హిట్ అయ్యింది. ఈ చిత్రంతో హీరో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతోంది.

    కేజీఎఫ్2 కొత్త రిలీజ్ డేట్ ను మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

    కాగా ప్రేక్షకులతోపాటు సినీ వర్గాలు సైతం కేజీఎఫ్2పై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. అయితే కరోనా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటికే రిలీ్ కావాల్సిన ఈ భారీ మూవీ కరోనా వల్ల థియేటర్లలోకి రాలేకపోతూ వాయిదా పడింది.

    తాజాగా ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ రావడంతో యశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక షాకింగ్ విషయం ఏంటంటే.. కేజీఎఫ్ 2తోపాటు ప్రభాస్ ప్రస్తుతం తీస్తున్న సలార్ మూవీని కూడా ఇదే డేట్ కు విడుదల చేస్తామని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించడం విశేషం. అంటే ఒక డైరెక్టర్ తన రెండు సినిమాలను ఒకే సారి విడుదల చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.