Rajendra Prasad: రామోజీకి క్షోభ.. దేవుడు సరి చేశాడు.. రాజేంద్రప్రసాద్ సంచలన కామెంట్స్

దరిద్రపు, చెత్త రాజకీయాల వల్ల రామోజీరావు చివరి రోజుల్లో మానసిక క్షోభను అనుభవించి వెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దేవుడు చూశాడని.. అందుకే నిజాన్ని గెలిపించాడని కామెంట్స్ చేశారు.

Written By: Dharma, Updated On : June 8, 2024 12:33 pm

Rajendra Prasad

Follow us on

Rajendra Prasad: జగన్ వల్లే రామోజీరావు అనారోగ్యానికి గురయ్యారా? కేసుల పేరుతో వేధించడం వల్ల ఇబ్బంది పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.తెలుగు నాట మీడియా మొఘల్ గా ఎదిగారు రామోజీరావు. ఈనాడు దినపత్రిక, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో సంచలనం సృష్టించారు. తనదైన ముద్ర వేసుకున్నారు. తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించారు. ప్రియా పేరిట పచ్చళ్ళ తయారీలో కూడా అడుగులు వేశారు. అక్కడ కూడా విజయవంతం అయ్యారు.

రామోజీరావు అకాల మృతి పై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ, కాబోయే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎంలు కేసిఆర్, జగన్, కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రామోజీరావు మరణ వార్త విన్న చంద్రబాబు హుటా హుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చారు. భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దరిద్రపు, చెత్త రాజకీయాల వల్ల రామోజీరావు చివరి రోజుల్లో మానసిక క్షోభను అనుభవించి వెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దేవుడు చూశాడని.. అందుకే నిజాన్ని గెలిపించాడని కామెంట్స్ చేశారు. రామోజీరావు ఈ ఘనవిజయాన్ని చూసే వెళ్లారని.. అది చాలా సంతోషంగా ఉందని.. ఆయన అనుకున్నది సాధించి వెళ్ళారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.మార్గదర్శి విషయంలో రామోజీరావు పై జగన్ సర్కార్ వెంటాడిన సంగతి తెలిసిందే. సిఐడి ఆయన ఒక బెడ్ పై పడుకొని ఉన్న ఫోటో ఒకటి అప్పట్లో దర్శనమిచ్చింది. కానీ కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకే రామోజీ అలా చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని.. జగన్ సర్కార్ వేధించడం వల్లే చివరి రోజుల్లో రామోజీ ఇబ్బంది పడ్డారన్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఇప్పుడు రామోజీ మరణంతో జగన్ సర్కార్ తప్పిదాలు బయటపడుతుండడం విశేషం.