AP Election Survey 2024: ఇప్పటివరకు అనేక జాతీయ మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వచ్చాయి. టిడిపి,జనసేన, బిజెపి కూటమి కట్టకముందు వరకు అనేక జాతీయ సర్వే సంస్థలు వైసీపీ దే విజయం అంటూ చెప్పుకొచ్చాయి. అయితే కొద్ది రోజులుగా వస్తున్న సర్వేలన్నీ కూటమిదే ఏపీలో అధికారం అని చెబుతున్నాయి. ఇటువంటి తరుణంలో రేస్ సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. అయితే ఇప్పటివరకు వచ్చిన సర్వేలకు భిన్నంగా ఫలితాలను వెల్లడించడం విశేషం.
ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలకు గాను వైసిపి స్పష్టంగా 109 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే తేల్చింది. కూటమి కేవలం 32 స్థానాలకే పరిమితం కానుందని స్పష్టం చేసింది. మరో 33 చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని.. అక్కడ కూడా వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోందని ఈ సర్వే స్పష్టం చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని తేలింది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను.. వైసిపి ఏకంగా 20 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధించనుంది. ఓటమి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది. మరో మూడు చోట్ల గట్టి ఫైట్ ఉంటుంది.
ప్రస్తుతానికి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి గుంటూరు, అమలాపురంలో మాత్రమే టిడిపి గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. మరో మూడు స్థానాల్లో వైసిపి, కూటమి మధ్య గట్టి పైట్ ఉంటుంది. విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల్లో ఇ రుపాక్షాలు హోరా హోరీగా తలపడనున్నాయి. మిగతా సీట్లలో మాత్రం వైసిపి విజయం సాధించనుంది. ఈ సర్వే ఫలితాలను చూస్తే వైసిపి గత ఎన్నికల్లో సాధించిన విజయానికి దగ్గరగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి 22 పార్లమెంట్ స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ కచ్చితంగా గెలుచుకునే స్థానాలు 20. మరో మూడు స్థానాల్లో గట్టి ఫైట్ ఉంది. అక్కడ కూడా వైసిపికి ఎడ్జ్ కనిపిస్తోంది. అందుకే గత ఎన్నికల్లో ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.