Pulivendula Repolling: పులివెందుల( pulivendula) ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్ననే అక్కడ జడ్పిటిసి ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికలను వైసిపి తో పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే నిన్న పోలింగ్ రోజున ఉదయం నుంచి ఉత్కంఠ పరిస్థితులు కొనసాగాయి. పోలీసులు భారీగా వైసిపి తో పాటు టిడిపి నేతలను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు ఓట్లు వేసే అవకాశం ఇవ్వలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు. రెండు జెడ్పిటిసి సీట్ల కోసం చంద్రబాబు దిగజారి వ్యవహరించారని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల సంఘం రెండు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీచేసింది. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభం అయింది. అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఇది సంచలన అంశంగా మారింది.
Also Read: ఇలా జరుగుతుందని జగన్ కి ముందే తెలుసా? అందుకే సిద్ధమవుతున్నాడా?
రెండు కేంద్రాల్లో రీపోలింగ్..
నిన్న జరిగిన పోలింగ్ కు సంబంధించి అనూహ్య పరిణామాలు జరిగాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో రెండు చోట్ల పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ కేంద్రం 3, 14 లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 1,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదుతోనే ఎలక్షన్ కమిషన్( Election Commission) ఇక్కడ రీ పోలింగ్నకు ఆదేశించింది. రేపు ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. కౌంటింగ్ జరగనుంది.
Also Read: విచారణకు ఏపీకొచ్చిన రాంగోపాల్ వర్మ.. అరెస్ట్ కు రంగం సిద్ధం?
పోలింగ్ బహిష్కరణ
అయితే రీపోలింగ్ జరుగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) కీలక ప్రకటన చేశారు. చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. రెండు జెడ్పిటిసి స్థానాల కోసం చంద్రబాబు ఇంత దిగజారి రాజకీయాలు చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ డే గా అభివర్ణించారు. ఈరోజు జరుగుతున్న రీపోలింగ్‌ను బహిష్కరించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పులివెందులలో ఎన్నికపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపటి కౌంటింగ్ ను వాయిదా వేసి.. కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. నిన్న పులివెందుల మండలంలో జరిగిన ఎన్నికల్లో 76.44% పోలింగ్ నమోదయింది. అయితే సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. కానీ ఇక్కడ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.