War 2 Climax Twist: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న పాన్ ఇండియన్ చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ గొప్పగా జరగడం లేదు. రేపు ఈ చిత్రం తో పాటు విడుదల కాబోతున్న రజనీకాంత్ ‘కూలీ’ చిత్రానికి కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది ఈ చిత్రం. ఓవర్సీస్ లో ఎలాగో పదింతలు ఎక్కువగా ‘కూలీ’ చిత్రమే ట్రెండ్ అవుతుంది. ‘వార్ 2’ కనీసం తెలుగు రాష్ట్రాల్లో అయినా డామినేషన్ చూపిస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా కూలీ దే డామినేషన్. ఇది అభిమానులకు కాస్త మింగుడు పడని విషయం.
Also Read: ‘కూలీ ‘ మూవీ యూఎస్ఏ రివ్యూ…
ఓపెనింగ్స్ ఎలాగో భారీగా ఉండవని తెలిసిపోయింది. కానీ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ భారీగా నమోదు అవుతాయి అనేది వాస్తవం. కానీ ఆ పాజిటివ్ టాక్ రావాలంటే కచ్చితంగా ఎన్టీఆర్ క్యారక్టర్ ని బాగా చూపించాలి. ఇందులో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. క్లైమాక్స్ ఫైట్ లో కచ్చితంగా విలన్ ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎన్టీఆర్ ని క్లైమాక్స్ లో ఎలా చూపించారో, ఆయనకు వ్యతిరేకంగా చూపిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మార్నింగ్ షోస్ నుండే తుడిచిపెట్టుకొని పోతుంది అని అభిమానులు కాస్త భయపడ్డారు. కానీ అభిమానులు భయపడాల్సిన అవసరమే లేదట. క్లైమాక్స్ ఎన్టీఆర్ అభిమానులు సంతృప్తి చెందే విధంగానే డిజైన్ చేశారట. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ని క్లైమాక్స్ లో పెట్టారట. ఇంతకీ ఏమిటి ఆ ట్విస్ట్? , అసలు ఏమైంది అనేది తెలియాలంటే మరి కొద్ది గంటలు ఎదురు చూడక తప్పదు.
Also Read: ‘వార్ 2’ మూవీ యూఎస్ఏ రివ్యూ
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఆమె క్యారక్టర్ కూడా రెగ్యులర్ హీరోయిన్ రోల్ లాగా ఉండదట. చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. టీజర్ లో కానీ, ట్రైలర్ లో కానీ ఆమె బికినీ వేసుకొని కనిపించిన షాట్స్ కుఱ్ఱలలో ఎలాంటి మంటలు రేపాయో మనమంతా చూసాము. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దాని గురించే చర్చ, బాగా వైరల్ అవ్వడం తో మేకర్స్ ఆ షాట్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ని కూడా విడుదల చేశారు. ఈమె హృతిక్ రోషన్ కి జోడీ గా చూపించారు. కానీ అదే హృతిక్ రోషన్ తో ఈమె ఫైటింగ్ చేస్తున్నట్టు కూడా చూపించారు. ఇలా సినిమా లో ప్రతీ క్యారక్టర్ కి ఒక ఆర్క్ ఉంటుందట. కచ్చితంగా ఈ చిత్రం అభిమానుల అంచనాలకు మించే ఉంటుందని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వపడేలాగానే ఉంటుందని అంటున్నారు, చూడాలి మరి.
When #War2 begins, your mission is to keep the secrets safe! Say no to spoilers.#War2 ONLY in cinemas worldwide from August 14th. Releasing in Hindi, Telugu and Tamil.pic.twitter.com/G5hGFd9p4y
Book your tickets now!https://t.co/5uc5EmvWxo | https://t.co/lXCDuacS44… pic.twitter.com/mSpt0UfqJg
— Jr NTR (@tarak9999) August 13, 2025