Coolie Movie USA Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు రజనీకాంత్…ఆయన చేసిన సినిమాలు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా డబ్ అవుతూ మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో చేసిన ‘జైలర్ ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు…ఇక ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా యూఎస్ఏ లో ఈరోజు రిలీజ్ అయింది. మరి యూఎస్ఏలో ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన వాళ్లు చెబుతున్న దాన్నిబట్టి చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: ‘వార్ 2’ మూవీ యూఎస్ఏ రివ్యూ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక కూలీగా ఉన్న వ్యక్తి తమిళనాడును శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు డాన్ గా మారిన తర్వాత ఎవరెవరు తన మీద రివెంజ్ తీర్చుకోవాలనే ప్రయత్నం చేశారు. పోలీసులకి తనకి మధ్య ఎలాంటి విభేదాలు ఎదురయ్యాయి అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది…
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజు చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇంతకుముందు ఆయన డైరెక్షన్లో వచ్చిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధించాయో ఈ సినిమా కూడా దానికి మించి ఉందని యుఎస్ఏ ప్రేక్షకులు తెలియజేస్తూ ఉండడం విశేషం… ముఖ్యంగా రజనీకాంత్ నటన చూస్తే ఒకప్పటి రజనీకాంత్ మళ్లీ కనిపించాడు అంటూ యూఎస్ఏ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే వింటేజ్ రజినీకాంత్ ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజు ఈ సినిమా విషయం లో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని భారీ ఎలివేషన్ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయట. సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ నట విశ్వరూపం చూపించినట్టుగా తెలుస్తోంది. ఇక నాగార్జునని విలన్ గా చూపిస్తూ చాలా వరకు ప్రేక్షకులను మెప్పించారట.అలాగే మూవీ క్లైమాక్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది…ఇక అనిరుధ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరిందట. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన ఎక్కడ తగ్గకుండా ఎలివేషన్స్ ఇచ్చే సన్నివేశాల్లో భారీ మ్యూజిక్ ని ఇచ్చి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంటూ యూఎస్ఏ ప్రేక్షకులు చెబుతుండడం విశేషం…
Sound-ah Yethu Deva is almost here! #Coolie from tomorrow in theatres near you!#Coolie releasing worldwide August 14th@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @Reba_Monica… pic.twitter.com/w0VjRFQraJ
— Sun Pictures (@sunpictures) August 13, 2025
ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ఇప్పటివరకు చేయనటువంటి ఒక గొప్ప పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. నాగార్జున డిఫరెంట్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి తనలోని విలనిజాన్ని బయటకి తీశాడు. ఒక రకంగా ఈ సినిమాలో నాగార్జునది చాలా కీలకమైన పాత్ర అనే చెప్పాలి… ఇక ఉపేంద్ర సైతం తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన పాత్రకి స్పేస్ చాలా తక్కువ ఉన్నప్పటికి కనిపించింది తక్కువ సమయమైనా ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడట… ఇక శృతిహాసన్, సత్యరాజ్, సౌరబ్ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారట…
ప్లస్ పాయింట్స్
రజినీకాంత్ యాక్టింగ్
లోకేష్ డైరెక్షన్
ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్
కథ
ఎమోషన్ సీన్స్…