2029 Elections: ఏ రాజకీయ పార్టీల మధ్య అయినా పొత్తులు శాశ్వతం కాదు. లాభనష్టాలను వేసుకొని.. రాజకీయంగా కలిసివచ్చే అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే పొత్తులు కొనసాగుతాయి. తమ పార్టీకి.. పార్టీని నమ్ముకున్న నేతలకు న్యాయం జరిగితేనే ఆ పొత్తులకు అర్థం ఉంటుంది. అదే సమయంలో ఉమ్మడి శత్రువు బలంగా ఉన్నప్పుడు కూడా పొత్తు పదిలంగా ఉంటుంది. అయితే ఆ పొత్తు వల్ల ప్రయోజనాలు ఉంటేనే రాజకీయ పార్టీలు కలుస్తాయి. వికటిస్తాయంటే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ప్రస్తుతం ఏపీలో( Andhra Pradesh) మూడు పార్టీల మధ్య గట్టి పొత్తు ఉంది. టిడిపి, జనసేన, బిజెపి పొత్తు కుదుర్చుకొని సూపర్ విక్టరీ సాధించాయి. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈ పొత్తు ఉంటుందా? అంటే మాత్రం ఉంటుంది అని ఆయా పార్టీలు చెబుతున్నాయి. కానీ ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించకపోతే ఈ పొత్తులు విచ్ఛిన్నం కావడం ఖాయం. అయితే 2029 నాటి పరిస్థితులకు అనుగుణంగానే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కొనసాగే అవకాశం ఉంది.
Also Read: పులివెందులలో ఓడితే.. ఇరు పార్టీలకు ప్రాణ సంకటమే!
మరో 15 ఏళ్ల పాటు..
ఏపీలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుందని.. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం( Alliance government ) ఉంటేనే ప్రజలకు మంచి పాలన అందించగలమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వనని హెచ్చరిస్తున్నారు. అయితే ఆయన సంకల్పంలో బలం ఉండవచ్చు కానీ.. పరిస్థితుల్లో మార్పులు వస్తే మాత్రం ఆయన నిర్ణయాలు మారి అవకాశం ఉంది. జనసేన శత శాతం విజయాన్ని సొంతం చేసుకుంది. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గం పోటీ చేసి అన్నిచోట్ల గెలుపొందింది. అయితే కేవలం 6% ఓటు బ్యాంకు ఉన్న జనసేన విజయం వెనుక తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఉందన్నది స్పష్టం. అయితే 100 స్ట్రైక్ రేటుతో జనసేనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే అదంతా మా బలంతోనే నన్న వాదన టిడిపి నుంచి ఉంది. అయితే ఆ రెండు పక్షాల మధ్య వాదన పెరిగితే మాత్రం వివాదాలు చెలరేగే అవకాశం ఉంది.
యువ బృందం దూకుడు..
ఎవరు లేదన్నా.. తెలుగుదేశం పార్టీపై( Telugu Desam Party) స్పష్టమైన పట్టు సాధించారు నారా లోకేష్. పూర్తిస్థాయిలో పట్టు బిగించారు కూడా. ఆయన చుట్టూ యువ బృందం పెరిగింది. భవిష్యత్తు వ్యూహరచనలో ఆ టీం ఉంది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఒంటరిగా బరిలో దిగుదామని ఒక వాదనను తెరపైకి ఎత్తిస్తోంది ఆ యువ టీం. టిడిపి బలమైన పార్టీ అని.. క్షేత్రస్థాయిలో మంచి బలం ఉందని.. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా విజయం సాధించి ఉండేదని నమ్మకంగా చెబుతోంది ఆ యువ బృందం. ఒకవేళ ఎన్నికల ముంగిట అదే నమ్మకం పెరిగితే మాత్రం అకస్మాత్తుగా టిడిపి ఒంటరి పోరుకు దిగే అవకాశం ఉంది.
కాంగ్రెస్ బలపడితే..
ప్రస్తుతం జాతీయస్థాయిలో బిజెపి ప్రత్యర్థి పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వానికి ఇప్పుడిప్పుడే మద్దతు పెరుగుతోంది. అయితే రాహుల్ గాంధీ ప్రభావం పెరిగితే మాత్రం.. మోడీ హవా తగ్గే అవకాశం ఉంది. తప్పకుండా అప్పుడు చంద్రబాబు పునరాలోచనలో పడతారు. చంద్రబాబు బిజెపితో పొత్తు రికార్డు చూస్తే ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. 1999లో బిజెపితో పొత్తు పెట్టుకుని గెలిచారు. 2004లో పొత్తు పెట్టుకున్నా ఓడిపోయారు. 2014లో మరోసారి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. 2019లో పొత్తు కుదుర్చుకోలేదు. 2024లో మాత్రం పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. బిజెపి విషయంలో ఒక్కటి నిజం. ఆ పార్టీ బలంగా ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుంటేనే ఫలితముంటుంది. లేకుంటే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత సైతం పనిచేస్తుంది. జాతీయస్థాయిలో బిజెపి పై వ్యతిరేకత ప్రారంభం అయితే.. యాంటీ సెంటిమెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తద్వారా వంటరి పోరాటానికి చంద్రబాబు జై కొట్టే అవకాశం ఉంది.
Also Read: అర్ధరాత్రి పూట అవినాష్ రెడ్డి అరెస్టు.. పులివెందులలో ఏం జరుగుతోంది..
వేరు పడేందుకు అలా చాన్స్..
ఒక్కోసారి పొత్తు అనేది వికటిస్తుంది. సీట్ల సర్దుబాటు తో పాటు నేతలందరినీ సంతృప్తి పరచకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. మరో 50 సీట్లు అదనంగా పెరుగుతాయి. 225 స్థానాలు ఉంటాయి. అటువంటిప్పుడు కచ్చితంగా జనసేన 50 అసెంబ్లీ సీట్ల వరకు డిమాండ్ చేస్తుంది. బిజెపి సైతం తమ ప్రాతినిధ్యం పెంచుకోవాలని చూస్తుంది. అయితే ఆ రెండు పార్టీలకు సీట్లు కేటాయిస్తే టిడిపిలో ఆశావాహులు నిరాశకు గురి కావడం ఖాయం. పోనీ జనసేనకు సీట్లు తగ్గించి ఇస్తే.. ఆ పార్టీలో టికెట్ల కోసం చేరిన వైసీపీ నేతల పరిస్థితి ఏంటి? అంటే కలిసి ఉండి ఇబ్బంది పడడం కంటే.. వేరువేరుగా పోటీ చేసి.. గెలిచిన తర్వాత పొత్తు పెట్టుకుందామన్న ప్రతిపాదన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.