https://oktelugu.com/

Prudhvi Raj: అమ్మ బత్తాయో.. ఏపీలో గెలుపు ఎవరిదో చెప్పిన పృథ్విరాజ్

మొన్నటికి మొన్న జనసేనలో అధికారికంగా చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అప్పటినుంచి జగన్ సర్కార్ పై విమర్శల డోసు పెంచారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.

Written By: , Updated On : March 5, 2024 / 12:50 PM IST
Prudhvi Raj

Prudhvi Raj

Follow us on

Prudhvi Raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి అందరికీ సుపరిచితులే. సినిమాతో పాటు రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు.అయితే రాజకీయంగా ఎన్నో రకాల విమర్శలకు గురయ్యారు.వివాదాలకు కారణమయ్యారు. పృధ్వి గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేశారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అప్పట్లో చంద్రబాబుపై విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉండేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వికి మంచి గౌరవమే దక్కింది. టీటీడీలో కీలక పోస్ట్ కూడా దక్కించుకున్నారు. కానీ కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆ పదవికి దూరమయ్యారు. క్రమేపీ వైసీపీకి కూడా దూరం జరిగారు. అప్పటినుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు.

మొన్నటికి మొన్న జనసేనలో అధికారికంగా చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అప్పటినుంచి జగన్ సర్కార్ పై విమర్శల డోసు పెంచారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ విమర్శించాల్సి వస్తే నాలుగు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓడిపోయారు అని అంటారు. అంతకంటే ఆయనపై విమర్శలు చేయడానికి ఇంకా ఏమున్నాయి మీ బతుకులకు అంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో వార్ వన్ సైడ్. ఎటు తిరిగి వార్ డిసైడ్ అయిపోయింది. యుద్ధం మేము చేయనక్కర్లేదు. యుద్ధం రెడీగా ఉంది ఓట్ల రూపంలో అంటూ పృథ్వి కామెంట్స్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓట్లు గుద్దుడే గుద్దుడు. రాసుకో ఈరోజు చెబుతున్నా. 136 సీట్లు గెలుస్తాం. 21 పార్లమెంట్ స్థానాలు మావే. ఇది పృధ్వీరాజ్ సర్వే. నీవు ఎన్ని సర్వేలు చేయించినా ఫలితం అదే. 136 సీట్లలో నాలుగు అటూ ఇటూ అవుతాయి కానీ.. ఇదే ఫలితం రిపీట్ అవుతుంది. వార్ వన్ సైడే అంటూ పృథ్వి తేల్చి చెప్పారు. పనిలో పనిగా వైసీపీ సోషల్ మీడియా పై విరుచుకుపడ్డారు. మీరు ఎన్ని వాగినా..ఎన్ని చెప్పినా అదే ఫలితం వస్తుంది పేటీఎం బ్యాచ్ అంటూ తేల్చి చెప్పారు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ హెచ్చరికలు పంపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.