https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథలోకి నితిన్ ఎలా వచ్చాడు…

గురూజీ త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయాలనుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 5, 2024 / 12:28 PM IST

    Pawan Kalyan and Nithin

    Follow us on

    Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న స్టోరీ లోకి మరొక హీరో రావడం అనేది సాధారణంగా మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం…ఆ హీరో డేట్స్ లేకపోవడం వల్ల గాని, లేదా ఆ హీరోకి స్టోరీ నచ్చకపోవడం వల్ల గాని, సినిమాలకు సంబంధించిన విషయాల్లో హీరోలు మారిపోతూ ఉంటారు. అయితే దర్శకులు మొదట ఒక హీరోని ఊహించుకొని కథ రాసుకున్నాక కూడా ఆ హీరో ఆ సినిమా చేయలేకపోతే ఆ స్క్రిప్ట్ ని మరొక హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తారు.

    ఇక ఇలాంటి క్రమంలో ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే గురూజీ త్రివిక్రమ్(Trivikram) అత్తారింటికి దారేది సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయాలనుకున్నాడు. ఇక వెంటనే అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాని పూర్తి చేసి పవన్ కళ్యాణ్ తో ‘అఆ ‘ సినిమాని తెరకెక్కించాలని చూశాడు.

    కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాను నితిన్ తో చేయమని త్రివిక్రమ్ కి సూచించాడు. ఎందుకు అంటే నితిన్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడం ఇక దానికి తోడుగా వాళ్ళ మధ్య మంచి సన్నిహిత్యం ఉండటం వల్లే తను నితిన్ పేరుని సజెస్ట్ చేశాడు. దాంతో త్రివిక్రమ్ ఆ సినిమాను నితిన్ తో చేసి ఆయన కి ఒక సూపర్ సక్సెస్ ను అందించాడు.

    ఇక దానివల్లే పవన్ కళ్యాణ్ చేయాల్సిన అఆ సినిమాని నితిన్ చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. అలా పవన్ కళ్యాణ్ పుణ్యమాని నితిన్ కి భారీ సక్సెస్ అయితే దక్కింది. ఇక ప్రస్తుతం నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇది కూడా పవన్ కళ్యాణ్ సినిమా టైటిలే కావడంతో దానిని వాడుకొని నితిన్ మరొక సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…