Priyadarshini Ram: సాక్షి దినపత్రిక, టీవీ ఎదుగుదలలో కీలకంగా వ్యవమరించిన వారిలో ప్రియదర్శిని రామ్ ఒకరు. ప్రారంభంలో ఈనాడుకు గట్టి పోటీ ఇవ్వడంతోపాటు జగన్‌ను సీఎం చేయడంలో కీలకంగా వ్యవహరారు రామ్. అయితే సడెన్‌గా ఒక రోజు ఆయన సాక్షి నుంచి బయటకు వచ్చారు. తర్వాత మళ్లీ జాయిన్ అయ్యారు. అలా ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది.. తర్వాత ఎందుకు జాయిన్ అయ్యారో ఆయనే ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మేనేజ్‌మెంట్‌కు చెప్పకుండా..
జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడాక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల ఫలితాల ముందు రోజు ఉద్యోగులంతా కవరేజీ కోసం సిద్ధమయ్యారు. ఎలా ఇవ్వాలి.. ఎలాంటి పోస్టర్లు, ఫొటోలు పబ్లిష్ చేయాలి అనే వర్క్ మొత్తం ముందు రోజే రెడీ చేసుకున్నారు. రాత్రి 2 గంటల వరకు విధి నిర్వహణలో ఉన్న రామ్.. మరుసటి రోజు ఉదయం జగన్ ఇంటికి వెళ్లి కూడా సమాచారం ఇచ్చారు. ఫలితాలు వచ్చాక.. అన్ని కోణాల్లో కవరేజీ కోసం ఉద్యోగులంతా 5 గంటలకే ఆఫీస్‌కు వచ్చారు. అయితే నాడు ఇన్‌పుట్ ఎడిటర్‌గా ఉన్న ఓ వ్యక్తి మాత్రం రాత్రి 8:30 గంటలకు ఆఫీస్‌కు వచ్చాడు. దీంతో ఆగ్రహించిన రామ్ హోదాను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు రావడం లేదనికి అని రిజైన్ చేసి ఇంట్లో కూర్చో అని అన్నాడు. ఈ నిర్ణయం యాజమాన్యానికి చెప్పలేదు. తానేసొంతంగా తీసుకున్నాడు.
ఆయన పిలిచి సున్నితంగా..
మరుసటి రోజు నాడు సాక్షి ఎడిటోరియల్ డైర్టెర్(ఈడీ)గా ఉన్న ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రామ్‌ను తన రూంకు పిలిపించుకున్నాడు. ఇ¯Œ పుట్ ఎడిటర్ వంటి కీలక పోస్టులో ఉన్న వ్యక్తిని ఎవరికీ చెప్పుండా మానేయమనండం ఏంటని సున్నితంగా మందలించాడు. మొత్తగా రామ్ నిర్ణయాన్ని తప్పు పట్టాడు. దీనికి రామ్ వివరణ ఇచ్చాడు. అయినా అలా అనకుండా ఉండాల్సింది అని పేర్కొన్నాడు. ఇది నచ్చని రామ్ వెంటనే తాను ఉద్యోగానికి తక్షణమే రిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు రోజులకు సరిపడా ఆర్టికల్స్ రెడీ చేశానని కూడా ఎప్పాడు. వెంటనే సాక్షిని వీడారు.
జగన్ పిలుపుతో..
మరుసటి రోజే రామ్‌కు జగన్ నుంచి పిలుప వచ్చింది. ‘పిచ్చోడివా’ అని మందలించాడు. సాక్షి ఆశయం నెరవేర్చడంలో కీలకంగా వ్యవహరించే మీరు ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మందటించాడు. వెంటనే తిరిగి జాయిన్ కావాలని సూచించారు. దీంతో జగన్ సూచన మరకు తిరిగి సాక్షిలో జాయిన్ అయనట్లు తెలిపాడు.
సాక్షి ఫ్యామిలి ఎడిటర్‌గా..
రామ్ సాక్షి ఫ్యామిలీ పేజీ ఎడిటర్‌గా పనిచేశారు. సాక్షి పత్రికకు గుండెకాయలా ఉన్న ఫ్యామిలీ పాఠకులకు చేరువ చేయడంలో రామ్ కీలక పాత్ర పోషించారు. సండే బుక్‌లో కూడా కాలమ్స్ రాశారు. స్టోరీలు రాశారు.