Narendra Modi : ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. బిజెపి కూడా చెప్పుకోదగ్గ స్థాయికి మించిన స్థానాలలో విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఆశించినత స్థాయిలో ఎంపీల బలం లేకపోవడంతో టిడిపి సపోర్ట్ చేసింది. అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన ఎంపీల సపోర్ట్ ఇవ్వడంతో కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రాగలిగింది. ఎన్డీఏ కూటమి ప్రస్తుతం మూడోసారి దేశాన్ని పరిపాలిస్తోంది.. ఈ కూటమికి అధినేతగా నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు తమ భరోసా ఉంటుందని నరేంద్ర మోడీ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని అనేకసార్లు విశాఖపట్నం పంపించారు. కార్మికులతో చర్చలు జరిపించారు. చివరికి ప్రైవేటీకరణ ఉండదని.. ఉక్కు కర్మాగారం చేయూతకు తమ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
మోడీ సంచలన ప్రకటన
విశాఖకే కాకుండా.. దక్షిణ భారతదేశానికే తలమానికంగా ఉక్కు కర్మాగారం ఉంది. ఇక్కడ తయారయ్యే ఉక్కుకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఇక్కడి ఉక్కు కర్మాగారం కొద్ది రోజులుగా నష్టాల్లో నడుస్తోంది. ఆ నష్టాలు అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వేలానికి ఆ మధ్య కేంద్రం నిర్ణయించింది. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో కేంద్రం వెనకడుగు వేసింది. ఆ తర్వాత ఉక్కు కర్మగార విషయాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. అంతే కాదు కార్మిక సంఘాలను తనవైపు తిప్పుకుంది. ఎన్నికల్లో తనకు అనుకూలమైన ఫలితాలు రావడంతో.. ఇదే ఆశాజనకమైన తరణమని భావించి ఉక్కు కర్మా గారానికి చేయూత అందించింది. విశాఖ ఉక్కు గర్మగారానికి(Vizag Steel plant) కేంద్రం ఏకంగా 11, 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ” వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక నేపథ్యం ఉంది. ఈ స్టిల్ ప్లాంట్ ను ఆంధ్రుల హృదయాలలో చిరస్థాయిగా ఉంది. గురువారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి(Vizag Steel plant) ఈక్విటీ మద్దతు కింద పదివేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించాం. దానికి అదనంగా 1,440 కోట్లు జమ చేసాం. మొత్తంగా 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తున్నాం.. ఇది ఆత్మ నిర్భర్ భారత్(atma nirbhar Bharat) నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు దేశ నిర్మాణ రంగంలో(national construction field) ఉక్కు ప్రాముఖ్యతను వెల్లడిస్తుందని” నరేంద్ర మోడీ ప్రకటించారు.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో, ఈ కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించాము. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు రంగానికున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని ఈ చర్య…
— Narendra Modi (@narendramodi) January 17, 2025