Makara Sankranthi : సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. హైదరాబాద్(Hyderabad)లోని ఆంధ్రా సెటిలర్లంతా సొంతూళ్లకు వెళ్తారు. ఉమ్మడి రాష్ట్రం నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆంధ్రావాళ్లు ఊరెళ్తే హైదరాబాద్ సగం ఖాళీ అవుతుంది. ట్రాఫిక్(Traffic) లేని రోడ్లు కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ఫ్యూను తలపిస్తుంది. అయితే.. సొంతూళ్లకు వెళ్తున్నవారు నరకం చూస్తున్నారు. ఊరు వెళ్లేప్పుడు.. ఊరి నుంచి తిరిగి నగరానికి వచ్చేప్పుడు ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని రావడం పెద్ద సాహసంగా మారుతోంది. గంటల తరబడి రోడ్లపై కదలకుండా నిరీక్షించాల్సి వస్తోంది. టోల్ ప్లాజాల వద్ద అయితే సుమారు గంటపాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఫాస్టాగ్ అందుబాటులో ఉన్నా.. రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ఒక్కో టోల్‌ప్లాజా(Toll plaza) దాటడానికి కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది.
పండుగ సంబురం ఆవిరి..
సంక్రాంతి అంటే ఆంధ్రాలో అతిపెద్ద పండుగ. ఈ పండుగకు తెలంగాణలో ఉన్నవారే కాదు.. వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల్లో ఉన్నవారు కూడా వీలు చేసుకుని సొంతూరి బాట పడతారు. దీంతో ఆంధ్రా(Andhra) వెళ్లే రోడ్లన్నీ రద్దీగా మారతాయి. అయితే అన్ని రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారు ఒక వంతు అయితే హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లేవారు అంతకు మూడింతలు ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో రాజధాని హైదరాబాద్ కావడంతో ఆంధ్రాప్రాంత నుంచి వేల మంది వచ్చి ఇక్కడే సెటిల్‌అయ్యారు. వారి వారసులు, కుటుంబాలుగా విస్తరించాయి. దీంతో హైదరాబాద్‌లో కోటికిపైగా జనాభా ఉండగా, ఇందులో సుమారు 30 లక్షల మంది ఆంధ్రా ప్రాంతంవారే ఉండడం గమనార్హం. సంక్రాంతి వచ్చిందంటే ఈ 30 లక్షల మంది ఆంద్రాబాట పడతారు. వీరితోపాటు చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన వారు మరో లక్ష మంది వరకు ఉంటారు. దీంతో ఆర్టీసీతోపాటు రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లు(Special Trains), బస్సులు నడుపుతున్నాయి. ఇవి ఏమాత్రం చాలడం లేదు. దీంతో సొంత వాహనాల్లో సంగానికిపైగా వెళ్తున్నారు. కొందరు ప్రైవేటు వాహనాలు అద్దెకు తీసుకుని సొంతూరి బాటపడుతున్నారు.
ట్రాఫిక్ జాం..
ఆర్టీసీ వాహనాలు, ప్రైవేవటు వాహనాల రద్దీతో ఆంధ్రా వెళ్లే హైదరాబాద్–గుంటూరు రహదారి రద్దీగా మారుతోంది. కిలోమీటర్ ప్రయాణానికి ఐదు నిమిషాల సమయం పడుతుంది. దీంతో గంట ప్రయాణానికి నాలుగు గంటలు పడుతుంది. దీంతో గుంటూరు, విజయవాడ, తెనాలి, నెల్లూరు ప్రాంతాలకు చేరుకోవడానికి కనీసం పది నుంచి 12 గంటల సమయం పడుతుంది. జనవరి 10 నుంచి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు.. ఇప్పుడు తిరుగు పయనమయ్యారు. దీంతో మళ్లీ హైదరాబాద్–విజయవాడ ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. విపరీతమైన రద్దీ కారణంగా నల్గొండ జిల్లా చిట్యాలలోని మదర్ డెయిరీ సమీపంలో జాతీయ రహదారిపై రైల్వే అండర్‌పాస్ కింద లారీ చిక్కుకుంది. దీంతో వందలాది కార్లు లారీలు, నిలిచిపోయాయి.