Daaku Maharaj Collections : నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు దుమ్ము దులిపేసింది. కానీ ఆ తర్వాత మాత్రం ఢమాల్ అని పడిపోయింది. వచ్చిన పాజిటివ్ టాక్ కి, అక్కడ వస్తున్న వసూళ్లకు అసలు సంబంధమే లేదు. నాల్గవ రోజు 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, 5వ రోజు కేవలం 3 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నేడు అయితే అన్ని సెంటర్స్ లో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. బుక్ మై షో యాప్ లో గంటకు కేవలం వెయ్యి టికెట్స్ మాత్రమే అమ్ముడుపోతున్నాయి.
డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘గేమ్ చేంజర్’ కి కూడా అదే రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇక ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి, హిట్ టాక్ వచ్చిన సినిమాకి తేడా ఏముంది చెప్పండి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్స్ వేస్తున్నారు. ప్రాంతాలవారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 5 రోజులకు 12 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో 10 కోట్ల 47 లక్షలు, ఉత్తరాంధ్ర లో 8 కోట్ల 14 లక్షల రూపాయిలు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో 5 కోట్ల 67 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్ల 20 లక్షలు ,గుంటూరు జిల్లాలో 7 కోట్ల 37 లక్షలు, కృష్ణ జిల్లాలో 4 కోట్ల 80 లక్షలు, నెల్లూరు లో 3 కోట్ల 12 లక్షలు వచ్చాయి.
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 5 రోజులకు 56 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా 67 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 82 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ, వంద కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టడం మాత్రం అసాధ్యమని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరో వైపు విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని మొదటి వారంలోనే 100 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరబోతున్నాడు. బాలయ్య కూడా ఈ లిస్ట్ లోకి చేరుంటే చిరంజీవి, వెంకటేష్, బాలయ్య ఇలా ఈ ముగ్గురు సీనియర్ హీరోలు ఈ ఎలైట్ క్లబ్ లోకి చేరారు అని చెప్పుకోడానికి బాగుండేది. ఇప్పుడు అది మిస్ అవుతుంది.