Prime Minister Modi: ప్రధాని మోదీ నేడు ఏపీలో అడుగుపెట్టనున్నారు. విశాఖలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేస్తున్నారు మోడీ. దాదాపు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ కు సైతం శ్రీకారం చుట్టనున్నారు. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను సైతం జాతికి అంకితం చేయనున్నారు. మోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కాగా ఏర్పాట్లు చేసింది. మోడీ( Narendra Modi) పర్యటనకు సంబంధించి ఇన్చార్జిగా మంత్రి నారా లోకేష్ వ్యవహరించారు. మూడు రోజుల కిందట ఆయన విశాఖలో అడుగుపెట్టారు. ఏర్పాట్లను సమీక్షించారు. మోదీ రోడ్ షో తో పాటు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సైతం పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరవుతారు.
* గతానికి భిన్నంగా
ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి అధికారం చేపడుతూ వస్తోంది. 2014 నుంచి 2019 మధ్య ఎన్డీఏలో టిడిపి భాగస్వామిగా ఉంది. కానీ అప్పట్లో విభజన హామీల అమలు విషయంలో విభేదాలు రావడంతో చంద్రబాబు( Chandrababu) ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2019లో మాత్రం ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. 22 పార్లమెంట్ స్థానాలతో పాటు 151 అసెంబ్లీ స్థానాలతో తిరుగులేని విజయం సాధించారు. కానీ ఎన్డీఏ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేక రాజకీయ అవసరాలు, ఏపీ పై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎన్డీఏ పై ఏర్పడింది. అందుకే అమరావతి రాజధాని( Amravati capital), పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక రైల్వే జోన్, రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఏపీకి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ అంశం.
* ఎన్డీఏ 3.. కారణం ఏపీ
కేంద్రంలో ఎన్డీఏ ( National democratic allowance ) మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో కూటమి దోహద పడింది. ఏకంగా 21 పార్లమెంట్ స్థానాలను అందించింది ఏపీ. కేంద్రంలో ఎన్డీఏ నిలబెట్టడంలో చంద్రబాబు( Chandrababu) కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఆ అవకాశం చిక్కింది కూడా. మరోవైపు ఎన్డీఏ తో పాటు బిజెపికి బలమైన స్నేహితుడిగా పవన్ మారారు. పవన్ సేవలను ఎన్డీఏ జాతీయస్థాయిలో కూడా వినియోగించుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అవసరం దృష్ట్యా, పవన్ చరిష్మ దృష్ట్యా ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రధాని మోదీ. గత రెండు సార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా.. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఈ స్థాయిలో ప్రాధాన్యం ఎప్పుడూ దక్కలేదు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను అభినందించాల్సిందే. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులతో పాటు ప్రాజెక్టులను రప్పించడంలో ఎవరికి వారే అన్నట్టు కృషి చేస్తూ వస్తున్నారు. వారిద్దరికీ ప్రధాని మోదీ సైతం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు.
* సాగరనగరంలో రోడ్డు షో
మోడీ విశాఖ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం నాలుగు 15 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు( ins dega) ప్రధాని చేరుకుంటారు. ప్రధానికి సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. 4:45 గంటలకు సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం( AU Engineering College Ground ) వరకు ప్రధాని మోడీ రోడ్ షో ఉండనుంది. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోడ్ షోలో( road show ) పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:45 గంటల వరకు ఈ సభ సాగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగించిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. మొత్తానికైతే ఈ ముగ్గురు నేతలు ఒక మోత మోగించనున్నారు. ఏపీకి తాము ఏం చేయబోతున్నాం అన్నది చెప్పబోతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Prime minister modi will visit visakhapatnam today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com