Viral Video : సాధారణంగా ఆలయాల్లో( temples ) అర్చకులు పూజలకు పరిమితం అవుతారు. నిత్యం ఏదో ఒక మంత్రోచ్ఛరణ చేస్తారు. భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ ఉంటారు. అయితే ఎల్లప్పుడూ దేవుడి సేవలో ఉండే అర్చకులు కాస్త రిలాక్స్ అయ్యారు. ఆటపాటలతో అదరగొట్టారు. బ్రేక్ డాన్సులతో చిందులేశారు. డాన్సర్లకు ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మందసలోని వాసు దేవుని బ్రహ్మోత్సవాల్లో వెలుగు చూసింది. అర్చకుల తీరు విమర్శలకు తావిచ్చింది.
* పురాతన ఆలయం
అదో పురాతన ఆలయం( historical Temple). ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించిన దేవస్థానం. అటువంటి చారిత్రకతను గుర్తించిన చినజీయర్ స్వామి దాని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పురాతన ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టారు. దీంతో గత 16 సంవత్సరాలుగా అక్కడ బ్రహ్మోత్సవాలు ఏటా నిర్వహిస్తుండడం ఆనవాయితీగా మారింది. శ్రీకాకుళం జిల్లా మందసలో చారిత్రక వాసుదేవ పెరుమాళ్ ఆలయం ఉంది. ప్రస్తుతం అక్కడ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే చివరి రోజు స్వామి వారి రథయాత్ర నిర్వహించారు. కోలాటం, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే సడన్ గా భక్తి, భజనలకు బదులు మాస్ పాటలు పెట్టారు. వాటికి పూజారులు, అర్చకులు బ్రేక్ డాన్సులు వేశారు. ఒక్కసారిగా అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* ఒక్కసారిగా డీజే పాటలతో
ఈ నెల 17న మందసాలో వాసుదేవుని బ్రహ్మోత్సవాలు( brahmotsav) ప్రారంభం అయ్యాయి. ఈనెల 23 వరకు కొనసాగాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అయితే చివరి రోజు ఆదివారం రాత్రి దేవదేవుని ఊరేగింపు మంగళ వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించాలని భావించారు. అయితే అకస్మాత్తుగా డీజే పాటలతో బ్రేక్ డాన్సులు కొనసాగాయి. ఆ డీజే పాటలకు అర్చకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ డాన్సులు వేశారు. అర్చకుల బ్రేక్ డాన్సులతో కొనసాగిన వాసుదేవుని ఊరేగింపు పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి
శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ డాన్స్ చేసిన అర్చకులు pic.twitter.com/o95QQxI4uG
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2025