https://oktelugu.com/

Sankranthi Pandem Kollu : సంక్రాంతి అంటేనే పందెం.. ఆ కోళ్ళ ను సిద్ధం చేయడమే ఓ యజ్ఞం

ఒక్కో కోడి పిల్లను రూ.10 వేల నుంచి రూ.30వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వాటిని పెంచి పందానికి సిద్దం చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2024 / 10:53 PM IST
    Follow us on

    Sankranthi Pandem Kollu : ఇంటికి వచ్చే పంటలు.. సందడి చేసే డూ డూ బసవన్నలు, అమ్మలక్కలు చేసే పిండి వంటలు.. నట్టింట కాలు మోపే ఆడ పడచులు.. అత్తింటి మర్యాదలు అందుకునే ఆల్లుళ్ళు.. ఇలా చెప్పు కుంటూ పోతే సంక్రాంతి పండగ వర్ణనకు అందందు. అయితే పండగకు మరో ప్రత్యేకత ఉంది. అవే కోడిపందాలు. తెలంగాణలో కంటే ఈ కోడిపందాలు ఆంధ్ర లోనే ఎక్కువగా జరుగుతుంటాయి.. ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రాలో కోడిపందాలు భారీ స్థాయిలో జరుగుతాయని అక్కడి వారు అంటున్నారు. ఇంతకీ కోడి పందాలు ఇలా నిర్వహిస్తారు? అందాల కోసం కోళ్లను ఏ విధంగా పెంచుతారు? వాటికి ఏ విధమైన ఆహారాన్ని అందిస్తారు? ఈ కథనంలో తెలుసుకుందాం.

    పందాలకున్న ప్రత్యేకతే వేరు

    సంక్రాంతికి కోడి పందాలకున్న ప్రత్యేకతే వేరు. పందాలు వేయాలంటే ప్రదానమైంది కోడి పుంజు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కో కోడి పైన కోట్ల రూపాయల పందాలను కాస్తుంటారు పందెపురాయుళ్లు. అందుకే పందెపు రాయుళ్ళుక్ పందాలు వేసే సమయంలో జాతి కోడి పుంజులను ఎంపిక చేసుకుంటారు. వాటిల్లోనూ సమయాన్ని బట్టి కోడి రంగు, ఇతర పరిస్థితులను అంచనా వేసుకొని పందెపు రాయుళ్ళు ‘‘కోడి పందాన్ని కడుతుంటారు’’. కోడి పందెం గెలిస్తేనే దానిపై వేసిన కోట్లాదిరూపాయల పందాన్ని గెలవడమో, ఓడటమో ఆధార పడి ఉంటుంది. అందుకే జాతి కోడి పుంజులను ఎంపిక చేసుకొని, వాటికి తగిన శిక్షణ, ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్ధాలు, ఈత కొట్టించడం ద్వారా కోడి పుంజులను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి పందాలకు సిద్దం చేసుకుంటుంటారు పందెపురాయుళ్ళు.

    కోట్లల్లో పందెపు కోళ్ళ వ్యాపారం..

    కోడి పుంజుల ఎంపిక కోసం, వాటిని పందానికి సిద్దం చేసేందుకు పందెపురాయుళ్ళు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు చాలా మంది. కోడి పుంజులకోసం ఎక్కడెక్కడో వెతికి కొనుగోలు చేస్తున్న పందెపురాయుళ్ళ ఆసక్తికి తగ్గట్టు ‘‘జాతి కోడి పుంజులను ’’ పెంపకం చేపట్టడం ద్వారా ప్రతి ఏటా కోట్లల్లో వ్యాపార లావాదేవీలు జరపడం ద్వారా మంచి ఉపాదిని పొందుతున్నారు. చాలా మంది తెలంగాణ లోని ఏపీ సరిహద్దుల్లో అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో దాదాపు 100వరకు జాతి కోడి పుంజుల కేంద్రాలు వెలిసాయి. ఇవే కాక వందల సంఖ్యలో 10 నుండి 50 కోడి పుంజులను ఇళ్ళవద్దే కుటీర పరిశ్రమలా చేసుకొని కోడి పుంజులను పెంచి, సంక్రాంతి సమయంలో వాటిని అమ్మడం ద్వారా ఉపాధిని పొందేవారి సంఖ్య వందల్లోనే ఉందని చెప్పవచ్చు.

    భారీ ఏర్పాట్లుతో కోడి పుంజుల పెంపకం..

    అశ్వారావుపేటలోని అల్లిగూడెం, గంగారం పరిసరాల్లో, దమ్మపేట మండలంలోని మందలపల్లి హైవేరోడ్డుల వెంట ‘‘జాతి కోడి పుంజుల పెంపకాన్ని భారీ ఎత్తున ప్రారంభించారు. ఒక్కో చోట 100 నుంచి 300 వరకు కోడి పుంజులను పెంచుతున్నారు. పామాయిల్‌, కొబ్బరి తోటల్లో బోర్లకు దగ్గరలో ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేసుకొని పలు రకాల జాతి కోడి పుంజులను పెంచుతున్నారు. సీసీ కెమెరాల పహారాలో, పదుల సంఖ్యలో పాలేర్లను పెట్టుకొని కోడి పుంజులను పెంపకాన్ని చేపట్టారు. ఒక్కో కోడి పిల్లను రూ.10 వేల నుంచి రూ.30వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వాటిని పెంచి పందానికి సిద్దం చేస్తున్నారు.