https://oktelugu.com/

ABN Andhrajyothy : దమ్మున్న పత్రిక.. తన తప్పులు తను చూసుకోవాలి కదా?

నిప్పులు చిమ్మే విధంగా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి.. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ ను బర్తరఫ్ చేసేదాకా తీసుకెళ్లిన ఆంధ్రజ్యోతి.. చివరికి ఎలా అయిపోయింది .. పాపం..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 5, 2024 / 02:56 AM IST
    Follow us on

    ABN Andhrajyothy : ఆ పిడిఎఫ్ పేపర్లు పక్కన పెట్టండి.. ఆ వాట్సప్ ఎడిషన్లు షట్ డౌన్ చేయండి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ.. ప్రింట్ మీడియా అంటే జనానికి ఏవగింపు కలుగుతున్న రోజుల్లోనూ.. కొన్ని పత్రికల ను పాఠకులు కచ్చితంగా చూస్తారు. అది వారికి అలవాటుగా మారింది మరి. గతంలో ఆ పత్రికలను కొనుగోలు చేసి చదివేవారు.. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. పత్రికలు వెబ్ ఎడిషన్లు రన్ చేస్తున్న తర్వాత.. కచ్చితంగా వాటిని చూస్తారు. అలాంటి పత్రికల్లో ఆంధ్రజ్యోతి కూడా ఉంటుంది. అయితే మిగతా పత్రికలకు ఆంధ్రజ్యోతికి తేడా ఏంటంటే.. ఫస్ట్ పేజీ ప్రయారిటీ అంశాలు బాగుంటాయి. చంద్రబాబు విషయాన్ని మినహాయిస్తే మిగతా అన్నింటిలో ఆ పత్రికకు వంక పెట్టలేం. తనదైన రోజు నిప్పులు మండిస్తుంది. ఎక్స్ క్లూజివ్ కథనాల్లో అయితే దుమ్ము రేపుతుంది. ఇవాల్టికి సూపర్ లీడ్ లేదా ఇంట్రో అనేవి ఆ పేపర్ లోనే కనిపిస్తున్నాయి.. తిగుల్ల కృష్ణమూర్తి నమస్తే తెలంగాణ ఎడిటర్ గా వెళ్లిపోయిన తర్వాత వక్కలంక రమణ ఆ బాధ్యతలు తీసుకున్నారు.. ఆ తర్వాత కొంతకాలానికి ఈనాడు నుంచి రాహుల్ వచ్చారు.. దత్తిరామ్ ఖాత్రి కూడా ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయ్యారు. సో ఏ లెక్కన చూసుకున్నా సెంట్రల్ డెస్క్ లో పెద్దపెద్ద తలకాయలే ఉన్నాయి. అంటే పేపర్ విషయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతనే బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ పెద్ద తలకాయలు పేపర్ ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.. అంతేకాదు రేవంత్ రెడ్డికి ప్రయారిటీ ఇచ్చే క్రమంలో వత్తులను కూడా మర్చిపోతున్నట్టున్నారు.

    ఈరోజు ఫస్ట్ పేజీలో తెలంగాణ ఎడిషన్ కు సంబంధించి విన్నపాలు వినవలె అంటూ ఒక బాక్స్ ఐటమ్ వాడారు. నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి షాను రేవంత్ రెడ్డి కలిసిన నేపథ్యంలో.. ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చకు సంబంధించి ఒక వార్తను ఇచ్చారు. అయితే ఈ వార్తకు సంబంధించి రెండవ డెక్ లో ప్రాధాన్యతల దృష్ట్యా జాతీయ హోదా దక్కేలా చూడండి.. అని పేర్కొన్నారు. అయితే ఇందులో దృష్ట్యా లో “ట” వత్తు ఎగరగొట్టారు. ఫలితంగా అది దృష్యా అయిపోయింది.. ఇది ఎవరి దృష్టి లోపం వల్ల జరిగిందో తెలియదు కానీ.. మొత్తానికి అయితే తప్పుగా పబ్లిష్ అయ్యింది. సాధారణంగా మెయిన్ ఎడిషన్ లో తప్పులు ఉండకూడదు అంటారు. అందుకే సెంట్రల్ డెస్క్ లో సఫీషియెంట్ గా మ్యాన్ పవర్ ఉండేలా చూసుకుంటారు. అంతేకాకుండా వీలైన ఎక్కువమంది పేజీ డిజైనర్ కూడా అందుబాటులో ఉంచుకుంటారు. కానీ అన్ని రకాలుగా ఉన్నప్పటికీ తప్పు జరిగిపోయింది అంటే మామూలు నిర్లక్ష్యం కాదు.

    పైగా ఇన్నర్ పేజీల్లో తప్పులు దొర్లాయి అంటే ఏదో ఒక కారణాన్ని సర్ది చెప్పుకోవచ్చు. కానీ అలాంటిది ఫస్ట్ పేజీలో బ్యానర్ కింది బాక్స్ ఐటమ్ లో తప్పు దొర్లడమంటే మామూలు విషయం కాదు. సెంట్రల్ డెస్క్ లో ప్రూఫ్ రీడింగ్ అనేది జరగడం లేదా.. లేక రేవంత్ రెడ్డి ఎలాగూ మనవాడే కాబట్టి.. తప్పులు కాస్తాడులే అనే ధైర్యమా.. ఏది ఏమైతేనేమీ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీని గతంలో మాదిరిగా పట్టించుకోవడంలేదని.. గతంలో మాదిరిగా రాధాకృష్ణ రాత్రి ఒంటిగంట వరకు ఉండటం లేదని.. తప్పులు దొర్లడాన్ని బట్టి తెలుస్తూనే ఉంది. మాది దమ్మున్న పత్రిక అని చెప్పే ఆ యాజమాన్యం.. ఇలాంటి తప్పులను ఎలా కప్పిపుచ్చుతుంది.. దాన్ని ఎలా సమర్థించుకుంటుంది? నిప్పులు చిమ్మే విధంగా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి.. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ ను బర్తరఫ్ చేసేదాకా తీసుకెళ్లిన ఆంధ్రజ్యోతి.. చివరికి ఎలా అయిపోయింది .. పాపం..