Praveen Prakash: బ్యూరోక్రసీ వ్యవస్థ( Bureaucracy system0 ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తుంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అధికారులను మార్చడం ఆనవాయితీ. తమకు నమ్మకస్తులైన అధికారులను నియమించుకుంటారు ప్రభుత్వ పెద్దలు. అయితే ప్రభుత్వాలు మారితే అప్రాధాన్య పోస్టులకు వెళతారే తప్ప.. ఉద్యోగాలను ఎవరూ వదులుకోరు కూడా. అయితే అలాంటి పని చేశారు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏకంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఇప్పుడు తాను చేసిన తప్పును తెలుసుకున్నారు. పశ్చాత్తాప పడుతున్నారు. తెలుగు మీడియాలోనూ.. అది కూడా అనుకూల మీడియాలోనూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏడాది కిందట తన రాజీనామా చేసిన ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు.
* చంద్రబాబు ప్రోత్సహించిన అధికారిగా..
ఏపీ సీఎం చంద్రబాబుకు( AP CM Chandrababu) అత్యంత దగ్గరైన అధికారి ప్రవీణ్ ప్రకాష్. అటువంటి అధికారి వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారు. పైగా ఈ ప్రవీణ్ ప్రకాష్ మూలంగా చాలామంది అధికారులు ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు ప్రోత్సహించారన్న కనీస కృతజ్ఞతలు లేకుండా వ్యవహరించారు ప్రవీణ్ ప్రకాష్. ఆపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉంటూ విద్యావ్యవస్థలో అధికారులతో పాటు ఉద్యోగులకు వ్యతిరేకం అయ్యారు. వైసిపి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేవారు. తాను ఒక అధికారిని అని మరిచి వ్యవహరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి మరింత లోకువ అయ్యారు. వైసీపీ అని ముద్రపడేలా వ్యవహరించారు.
* అది అంత సులువు కాదు..
వాస్తవానికి ప్రవీణ్ ప్రకాష్( Pravin Prakash) రాజీనామాను సచివాలయంలోని రోజువారి బాక్సులో వేసి వెళ్ళిపోయారు. అక్కడ కొద్ది రోజులకు రాజీనామా ఫార్మేట్ లో ఇచ్చి వెళ్లారు. అప్పట్లో ఆయన క్షణికావేశంతో ఆ పని చేశారు. నాలుగేళ్ల సర్వీసును వదులుకున్నారు. ఇప్పుడు తప్పు తెలుసుకున్నారు. కానీ సరైన ప్రయత్నం చేయడం లేదు. ఏపీ సీఎం చంద్రబాబు అధికారుల విషయంలో కక్ష సాధింపునకు దిగరు. చాలా సాఫ్ట్ కార్నర్ తో వెళ్తారు. గతంలో ఇదే ప్రవీణ్ ప్రకాష్ కు ప్రోత్సాహం అందించారు. కచ్చితంగా తన తప్పును తెలుసుకొని చంద్రబాబు వద్దకు వెళ్తే క్షమిస్తాడు కూడా. కానీ ప్రవీణ్ ప్రకాష్ ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు. టిడిపి అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి.. మళ్లీ తన ఉద్యోగాన్ని కొట్టేస్తానని కలలు కంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోని ఉన్నత కొలువుల్లో తన బాధ్యత అధికారులు ఉన్నారన్న విషయాన్ని ఆయన గ్రహించుకోవాలి. ఈ మీడియా ఇంటర్వ్యూలు కంటే నేరుగా వెళ్లి క్షమాపణలు కోరితే కొంత ఫలితం ఉంటుంది.