Pothina Mahesh: నాగబాబును గీతా ఆర్ట్స్ ఆదుకుందా? అల్లు అర్జున్ అండగా నిలిచారా? ఆర్థిక కష్టాల్లో ఉండగా భరోసా కల్పించరా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు.. అల్లు అర్జున్ మరోవైపు అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో తన సన్నిహితుడైన వైసిపి అభ్యర్థి శిల్ప కిషోర్ రవిచంద్ర రెడ్డి కి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. నేరుగా నంద్యాల వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. పవన్ విషయానికి వచ్చేసరికి కేవలం సోషల్ మీడియాలో మద్దతు తెలిపేందుకే పరిమితం అయ్యారు.
అయితే ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. అల్లు అర్జున్ తమ వాడిగా వైసిపి చెప్పుకోవడం ప్రారంభించింది. మెగా కుటుంబంలో చీలిక అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. మరోవైపు పోలింగ్ ముగిసిన అనంతరం నాగబాబు సైతం ఆసక్తికర ట్విట్ చేశారు. పరాయి వాడి కోసం పాకులాడే వాడు మనవాడు కాదు.. మనకోసం పనిచేసే పరాయి వాడు మనవాడు అంటూ.. నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు భిన్నంగా స్పందించారు.స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. వివాదాస్పద అంశంగా మారడంతో నాగబాబు తన ట్విట్టర్ పోస్టును డిలీట్ చేశారు. అయినా సరే వైసిపి దీనిని ఒక ప్రచార అస్త్రంగా మార్చుకుంటుంది. జనసేన మాజీ నాయకులను తెరపైకి తెచ్చి మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తోంది.
తాజాగా పోతిన మహేష్ మరోసారి తెరపైకి వచ్చారు.మెగా కుటుంబంలోచిచ్చుపై మాట్లాడారు.అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో నాగబాబుని ఆదుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నా పేరు సూర్య సినిమాలో నాగబాబుకు భాగస్వామ్యం కల్పించి ఆర్థికంగా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు.నాగబాబు నాగుపాము లాంటి వారని.. అటువంటి వ్యక్తికిపాలు పోసి గీతా ఆర్ట్స్ పెంచిందని చెప్పుకొచ్చారు.మెగా కుటుంబానికి కృతజ్ఞత ఉండదని.. తమకోసం పనిచేసేవారు గుర్తుండరని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నాగబాబు ట్విట్టర్ పోస్టును డిలీట్ చేయడం, తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ ప్రకటించడం జరిగింది. కానీ వైసీపీ మాత్రం అదే పనిగా మెగా కుటుంబంలో చీలిక తేవడానికి ప్రయత్నించడం అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.