పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్చించాలని తెలంగాణ జనసేన నాయకురాలు నిహారిక ఫైర్ అయ్యారు. పవన్ వర్సస్ పోసాని విదాదం రోజురోజుకు ముదురుతోంది. పోసాని పవన్ కల్యాణ్ తో పాటు ఆయన ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగడం, ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం తప్పు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. తాజాగా విషయమై నిహారిక స్పందించారు.

పోసానికి పిచ్చి పట్టిందని ఆయనను మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని మండిపడ్డారు. కాగా పోసాని అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అర్థం లేకుండా ఇష్టమొచ్చినట్లు పోసాని మాట్లాడారని నెటిజన్లు కూడా తప్పుబడుతున్నారు.
ఇదే విషయంపై బుధవారం పంజాగట్టు పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ పోసానిపై ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం స్పందించి పోసాని కృష్ణ మురళి పై చర్యలు తీసుకోవాలని నిహారిక డిమాండ్ చేశారు.
రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాన్ ఆడవాళ్ల పై అసభ్యకరంగా ఒక్క మాట మాట్లడలేదని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పవన్ కల్యాణ్ కామెంట్స్ చేసినందుకే పోసాని కృష్ణ మురళి ఇలా రియాక్ట్ అవుతున్నారని నిప్పులు చెరిగారు నిహారిక. ప్రభుత్వం స్పందించి వెంటనే పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని డిమాండ్ చేశారు.