బిగ్ బాస్ హౌస్ మొత్తానికి నాలుగో వారానికి చేరుకుంది. హౌస్ లోకి మొత్తం 19మందిని పంపిన హోస్ట్ నాగార్జున ఇప్పటికీ మూడు వారాల్లో ముగ్గురిని బయటకు పంపారు. ప్రస్తుతానికి బిగ్ బాస్ లో 16 కంటెస్టెంట్స్ ఉన్నారు. మొదటి వారానికి గాను బూతులతో రెచ్చిపోయిన “సరయు” ఎలిమినేట్ కాగా, రెండవ వారానికి గాను ఉమా దేవి, మూడవ వారానికి గానూ లేడీ అర్జున్ రెడ్డి లహరి ఎలిమినేట్ అయ్యింది.

ప్రతీ రోజు రోజుకి బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా మారుతుంది. మరి ముఖ్యంగా నామినేషన్స్ రోజు అందరి విశ్వ రూపాలు బయట పడుతున్నాయి. నాలుగో వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో హౌస్ మేట్స్ మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఆ ఎపిసోడ్ మొత్తం చాలా రంజుగా సాగింది. ఈ వారానికి గాను అధికంగా 8 మంది(నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి హన్మంత్, సన్నీ) ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఎటొచ్చిచూసినా ఈ వారం నామినేషన్ ఉన్న వారిలో రవి. సన్నీ, ప్రియ, సిరి, కాజల్‌లకు ఎలాంటి ఢోకాలేదు. ఎందుకంటే వారికి బయట ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. గేమ్ పరంగా కూడా బాగానే ఆడుతున్నారు. ఈ వారం ఎక్కువ ముప్పు పొంచి ఉన్నది మాత్రం నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబోల కి మాత్రమే. గేమ్ పరంగా నటరాజ్ మాస్టర్ బాగా ఆడుతున్నప్పటికి పవర్తన పరంగా మాత్రం అటు కంటెస్టెంట్స్‌ని, ఇటు ప్రేక్షకులను ఇబ్బందికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఆయన దారుణంగా ప్రవర్తించాడు. పులితో వేట.. నాతో ఆట ప్రమాదం అంటూ మీసం తీప్పడం లాంటివి ఓవరాక్షన్‌గా అనిపించాయి.
ఇంక లోబో విషయానికి వస్తే… ఇంట్లో పెద్ద ఎంటర్టైనర్.. గత సీజన్ లో ఉన్న అవినాష్ స్థానాన్ని భర్తీ చేసాడు. కాని టాస్కులు సరిగా ఆడకపోవడం అతని మైనస్. అంతే కాకుండా సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ప్రియ పై పెద్ద పెద్ద గా అరవడం, సింపతి కార్డ్ ప్లే చెయ్యడం అతి పెద్ద మైనస్. ఇక ఆని మాస్టర్ విషయానికి వస్తే… ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తో కలిసిపోయారు. కాని ప్రేక్షకులకి ఇబ్బంది పెట్టే పెద్ద విషయం ఏంటంటే నామినేషన్స్ లో చెప్పే కారణాలు. ప్రతిసారి నా కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనుక నామినేట్ చేస్తున్న అని యానీ చెప్పడం కరెక్ట్ కాదని నెటిజన్స్ కూడ అభిప్రాయపడుతున్నారు.
కానీ, అందరి కంటే డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం నటరాజ్ మాస్టర్. ఆని మాస్టర్ కూడా సేఫ్ జోన్ లో ఉన్నటు కనిపిస్తుంది. ఎందుకంటే గత మూడు ఎపిసోడ్స్ లో ముగ్గురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు వరుసగా నాలుగో అమ్మాయి ఎలిమినేట్ అయితే అబ్బాయిల డామినేషన్ ఎక్కువ అవుతుంది దాని వల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ పక్కా వుంటుంది. లోబో చేసే జోకులే అతన్ని కాపాడే చాన్స్ ఉంది. ఒకవేళ ఈ సారి లోబో ఎలిమినేట్ అయితే బిగ్‌బాస్ షో బోరింగ్ ఉంటే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన లోబో కాస్త సేఫ్ జోన్‌లో ఉన్నట్లే తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ వారం ఏదైన అద్భుతాలు జరిగితే తప్ప ఈ ముగ్గురిలో ఒక్కరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.