https://oktelugu.com/

RGV – Posani : ఆర్జీవి హత్యకు ప్లాన్ చేశారా? పోసాని వ్యాఖ్యల్లో నిజం ఎంత?

ఎన్నికలవేళ సింపతి కోసమే పోసాని కృష్ణ మురళి ఇలా మాట్లాడుతున్నారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే తన సంచలన వ్యాఖ్యలతో పోసాని మరోసారి వార్తల్లో నిలిచారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2024 / 01:11 PM IST

    RGV - Posani

    Follow us on

    RGV – Posani :  సంచలన కామెంట్స్ చేయడంలో పోసాని కృష్ణమురళి ముందుంటారు. ఏపీలో జగన్ పై ప్రత్యర్థులు విమర్శలు చేస్తే వెంటనే పోసాని తన నోటికి పని చెబుతారు. చంద్రబాబు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటూ ప్రసంగం ప్రారంభిస్తారు. ఆయన చేసిన కామెంట్స్ ఎప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా రామ్ గోపాల్ వర్మ హత్యకు ప్లాన్ చేశారని ప్రస్తావించడం గమనార్హం. సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటన నేపథ్యంలో పోసాని ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత దాకైనా తెగిస్తారని.. ఆర్జీవి హత్యకు టిడిపి నాయకత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపించారు. ఇందులో కొందరి పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం.

    గత కొద్దిరోజులుగా టిడిపి కంట్లో నలుసుగా రామ్ గోపాల్ వర్మ మారారు. జగన్ కు మద్దతుగా, టిడిపికి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు. రాజకీయంగా అనుచిత కామెంట్లు చేస్తున్నారు. అందుకే రామ్ గోపాల్ వర్మ అడ్డు తొలగించుకునేందుకు టిడిపి నాయకత్వం ప్రయత్నించిందన్నది పోసాని ఆరోపణ. అందులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు కుమారుడు అనిల్ అసలు సూత్రధారి అంటూ పోసాని పేర్కొన్నారు. తన తల్లి సాక్షిగా చెబుతున్నట్లు పోసాని చెబుతుండడం గమనార్హం. ఈ విషయాన్ని తనకు తన కమ్మ వాళ్లే చెప్పారని.. అనిల్ కిలారు రాజేష్ ద్వారా లోకేష్ కు అప్రోచ్ అయ్యారని.. ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. కానీ చంద్రబాబు మాత్రం నో చెప్పారని పోసాని చెబుతున్నారు.

    అయితే చంద్రబాబు నో చెప్పడానికి ఒక కారణం ఉందని.. ఆర్జీవి ఒక పిచ్చోడు.. అతడిని చంపితే మనకు వచ్చేదేముంది? వదిలేయండి అని చంద్రబాబు వారితో అన్నారని పోసాని వెల్లడించారు. ఈరోజు ఆర్జీవి అయ్యారని.. రేపు తాను అవుతానని పోసాని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మమ్మల్ని చంపండి కానీ.. ప్రజల మనిషి జగన్ ను చంపవద్దని పోసాని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే ఎక్కువమంది పోసాని వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ హత్య రాజకీయాలను ఎవరైనా ప్రోత్సహిస్తారా? అందునా ఓ వివాదాస్పద దర్శకుడు జోలికి ఎవరైనా వెళ్తారా? అటువంటిదేమీ లేదని.. ఎన్నికలవేళ సింపతి కోసమే పోసాని కృష్ణ మురళి ఇలా మాట్లాడుతున్నారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే తన సంచలన వ్యాఖ్యలతో పోసాని మరోసారి వార్తల్లో నిలిచారు.