Posani Krishna Murali: ఊహించిందే జరిగింది. అనుకున్నదే నిజమైంది. కూటమి ప్రభుత్వం ప్రముఖ నటుడు, దర్శకుడు, వైసిపి సానుభూతిపరుడు పోసాని కృష్ణ మురళికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. వల్లభనేని వంశీ విషయంలో మాదిరిగానే.. పోసాని కృష్ణ మురళి విషయంలోనూ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాకపోతే ఇందులో కొంచెం సినిమాటిక్ సస్పెన్స్ కొనసాగించింది. చివరికి వైసీపీకి అంతు పట్టని పని చేసింది.
పోసాని కృష్ణమురళిని ముందుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో అరెస్టు చేశారు. అరెస్ట్ కు ముందు పోసాని కృష్ణ మురళి ఇంట్లో పోలీసులకు ఆయనకు నాటకీయ పరిణామాలు జరిగాయి. పోలీసులకు, కృష్ణ మురళికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య కృష్ణ మురళిని పోలీసులు తమ వెంట తీసుకెళ్లారు. ముందుగా విజయవాడ తీసుకెళ్తారని ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ శ్రేణులు విజయవాడలోని కోర్టు ఎదుట మోహరించారు. అయితే వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓబులవారిపల్లె పోలీసులు కృష్ణ మురళిని కడప జిల్లాకు తీసుకెళ్లారు. ముందుగా ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్లో ఆయనను హాజరు పరిచారు. ఆ తర్వాత రైల్వే కోడూరు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. గురువారం పోసాని కృష్ణమురళిని పోలీసులు 9 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత రాత్రి జడ్జి ఎదుట హాజరు పరిచారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగినట్టు తెలుస్తోంది. పోసాని కృష్ణ మురళి తరఫున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. కృష్ణ మురళికి బెయిల్ ఇవ్వాలని కోరారు. దానికి న్యాయమూర్తి నిరాకరించారు. అంతేకాదు పోసాని కృష్ణ మురళికి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. దీంతో ఓబులవారి పల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.
Also Read: నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ ఎంపీ.. రెడ్ బుక్ లో ఉన్నది ఆయన పేరే?
టెంపర్ సినిమా చూపించారు
టెంపర్ సినిమా క్లైమాక్స్ లో మాదిరిగానే.. ఓబులవారిపల్లె పోలీసులు వ్యవహరించారు. పోసాని కృష్ణమురళికి చుక్కలు చూపించారు. ముందుగా విజయవాడకు తరలిస్తామని మీడియాకు హింట్ ఇచ్చారు. కానీ మీడియాకు కూడా ఝలక్ ఇచ్చారు. పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చివరి వరకు సస్పెన్స్ కొనసాగించారు.. ఆఖరికి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. దానికంటే ముందు అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రైల్వే కోడూరు కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి.. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోసాని కృష్ణమురళి వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. వాటిని నిరసిస్తూ టిడిపి నాయకులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. విచారణ ఖైదీగా కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.
Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో