Gorantla Madhav
Gorantla Madhav: వైయస్సార్ కాంగ్రెస్ లో( YSR Congress ) నెక్స్ట్ టార్గెట్ ఎవరు? కొడాలి నాని నా? లేకుంటే ఆర్కే రోజా నా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. గన్నవరం కేంద్రంగా ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూకబ్జాలతో పాటు బెదిరింపులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో రెడ్బుక్ సంస్కృతి అమలవుతోందని ఆరోపణలు చేస్తోంది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అన్న ప్రచారం నడుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం రూటు మార్చినట్టు కనిపిస్తోంది. నెక్స్ట్ టార్గెట్ అనంతపురం అన్నట్టు ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పోలీసుల వైఖరి ఉంది.
Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో
* అనూహ్యంగా మాధవ్ ఎంట్రీ..
2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా మెరిశారు గోరంట్ల మాధవ్( gorantla Madhav). అప్పటివరకు పోలీస్ శాఖలో ఆయన ఒక సీఐ. కానీ ఒక వ్యూహం ప్రకారం జేసి దివాకర్ రెడ్డి పై తిరుగుబాటు చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో సైతం పోలీస్ పవర్ చూపించారు. సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. పోలీస్ శాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అత్యధిక మెజారిటీతో గెలిచారు.
* ఏరి కోరి కష్టాలు
అయితే ఏ దూకుడుతో ఎంపీగా రాజకీయంలోకి అడుగుపెట్టారో.. అదే దూకుడుతో ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఓ న్యూడ్ వీడియోతో( nude video) ఎంపీగా అడ్డంగా బుక్కయ్యారు. ఆ గౌరవం తెచ్చుకున్నారు. ఏ స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారో.. అదే స్థాయిలో పతనం అంచుకు చేరుకున్నారు. ఓ అశ్లీల ప్రవర్తనతో తన రాజకీయ జీవితానికి తనకు తానే చరమగీతం పాడుకున్నారు. కనీసం ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకోవడంలో విఫలం అయ్యారు.
* గౌరవప్రదమైన వృత్తిలో
గౌరవప్రదమైన పోలీస్ శాఖలో( police department) తన వృత్తిని ప్రారంభించి రాజకీయాల్లో అడుగుపెట్టారు గోరంట్ల మాధవ్. కానీ అంతకుమించి అగౌరవాన్ని మిగిల్చుకున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. అయితే ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు గోరంట్ల మాధవ్ కు. అయితే తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో మాధవ్ కు ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభం అయ్యాయి. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు తనం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఓ మైనర్ విషయంలో అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి నోటీసులు అందుకున్నారు గోరంట్ల మాధవ్. అప్పట్లో గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోకు అడ్డగోలుగా సమర్ధించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అప్పట్లో ఓ మైనర్ పట్ల అడ్డగోలుగా మాట్లాడారని అప్పటి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తాజాగా ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ పోలీసులు గోరంట్ల మాధవ్ కు నోటీసులు అందించారు. మార్చి ఐదున విచారణకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో వల్లభనేని వంశీ మోహన్, పోసాని కృష్ణ మురళి సరసన గోరంట్ల మాధవ్ చేరినట్లు అయింది. రెడ్ బుక్ లో నెక్స్ట్ టార్గెట్ ఆయనేనని తేలింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: పిఠాపురం ఇలాకాలో ఓటుకు రూ.3000.. పట్టభద్రులు పండుగ చేసుకున్నారు.. వైరల్ వీడియో