Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali) అరెస్టు రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే గత కొద్ది రోజుల కిందట ఆయన రాజకీయాలను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా తేల్చి చెప్పారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు అరెస్టు కావడంతో సర్వత్ర చర్చనీయాంశం అయింది. ఎప్పుడో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటనే ప్రశ్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తోంది. ఇది ముమ్మాటికి తప్పుడు నిర్ణయమని.. వేధించడమేనని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో టిడిపి తో పాటు జనసైనికులు దిమ్మదిరిగే కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ ఎంపీ.. రెడ్ బుక్ లో ఉన్నది ఆయన పేరే?
* జగన్ పై వీర విధేయత
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి కంటే ఎక్కువగా వ్యవహరించేవారు పోసాని కృష్ణ మురళి. జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైన అభిమానం చూపేవారు. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోసాని కృష్ణమురళికి కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చారు. అది సినీ పరిశ్రమకు చెందిన పదవి అయినా.. అంతకుమించి రాజకీయ అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు పోసాని కృష్ణ మురళి. జగన్మోహన్ రెడ్డి పై ఈగ వాలనిచ్చేవారు కాదు. ఈ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబుపై చేసిన పదప్రయోగం అంతా ఇంతా కాదు.
* పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు
పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్ట్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న వేళ.. అదే పోసాని పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కుటుంబం పై విరుచుకుపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫోన్ చేసి తనను తిట్టారని.. పవన్ కళ్యాణ్ గురించి పోసాని మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఏమాత్రం సహించలేని విధంగా వ్యాఖ్యానించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ భార్య గురించి, కూతురి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మధ్యలో జర్నలిస్టులు అభ్యంతరం పెట్టిన ఆయన ఆగలేదు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ గురించి కూడా ఘోరంగా మాట్లాడారు.
* అప్పట్లో వెటకారంగా
ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి జైలుకు( jail) వెళ్తున్నారు. అయితే ఆయన పట్ల సానుభూతి చూపాల్సిందే. కానీ ఓ వీడియోలో ఆయన మాటలు చూసిన తర్వాత మనం బాధపడం. 2023 సెప్టెంబర్ లో చంద్రబాబు అవినీతి కేసుల్లో పట్టుకున్నారు. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆ సమయంలో పోసాని కృష్ణమురళి సాక్షి మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అవినీతి పనులు చేశాడు కదా.. చేసినప్పుడు జైల్లో పెడతారు కదా.. ఉండు బ్రహ్మాండంగా జైల్లో ఉండు.. ఏడాదో.. యాడాదిన్నర ఉండి బయటకు వచ్చాక అయినా నిజాయితీగా ఉండు.. అంటూ వెటకారంగా మాట్లాడారు పోసాని. ఇప్పుడు టిడిపి శ్రేణులు సైతం అదే వీడియోను పోస్ట్ చేసి.. అలానే ఉండాలని పోసాని కృష్ణ మురళికి సలహా ఇస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో
