Posani Krishna Murali : ప్రముఖ సినీ నటుడు, వైసీపీ పార్టీ నేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మైన్ పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) ని రాయచోటి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి రైల్వే కోడూరు కోర్టు లో పోసాని ని హాజరుపర్చగా ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ నిర్వహించారు. అయితే పోసాని తరుపున న్యాయవాది నేడు బెయిల్ పిటీషన్ పై విచారణ కోరగా జడ్జీ తిరస్కరించాడు. రేపటి నుండి ట్రైనింగ్ కి వెళ్తున్నందున విచారణ చేపట్టలేనని చెప్పాడట. రేపు, ఎల్లుండి కోర్టుకు సెలవు దినాలు కావడంతో, సోమవారం వరకు విచారణ చేపట్టే అవకాశాలు లేవు. దీంతో పోసాని కృష్ణ మురళి బెయిల్ అంశంపై తీర్పు సోమవారం రోజున రానుంది. మాజీ సీఎం జగన్ ఇటీవలే పోసాని భార్య కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read : కూటమిపై జ‘గన్’.. బడ్జెట్‌లో బ్రహ్మాస్త్రం ఇచ్చిన ఏపీ సర్కార్!
జగన్ పంపించిన సీనియర్ మోస్ట్ లాయర్ సుధాకర్ రెడ్డి పోసాని తరుపున వాదిస్తున్నాడు. కాబట్టి పోసాని కి బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఒకవేళ అదే జరిగితే టీడీపీ, జనసేన శ్రేణులు బాగా నిరాశకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో పోసాని కృష్ణ మురళి ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ని(AP CM Nara Chandrababu Naidu) , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ని అసభ్య పదాజాలంతో ఏ రేంజ్ లో తిట్టాడో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని అయితే సభ్య సమాజం సిగ్గు పడే రేంజ్ లో తిట్టాడు. పవన్ కళ్యాణ్ కూతుర్లపై కూడా చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసాడు. అవి చూసిన తర్వాత పోసాని పై కోపం రాని మనిషంటూ ఎవ్వరూ ఉండరేమో. అందుకే అతను అరెస్ట్ అయ్యాక అత్యధిక శాతం మంది హర్షం వ్యక్తం చేసారు.
వైసీపీ శ్రేణులు అతనికి సపోర్ట్ చేస్తే జనాలు తిట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే పోసాని అరెస్ట్ అయ్యింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తిట్టినందుకు కాదు, కులాల మధ్య చిచ్చు రేపెలా పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలుగు దేశం పార్టీ కార్యకర్త కేసు వేయడంతో అరెస్ట్ అయ్యాడు. ఆయనపై ప్రస్తుతం నాన్ బెయిలబుల్ కేసులు పడ్డాయి. ఇందులో ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇకపోతే ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే పోసాని కృష్ణ మురళి, ఈమధ్య కాలం లో సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా వివాదాల్లోకి చిక్కుకున్న తర్వాత పోసానికి సినిమా అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. రాజకీయాల నుండి కూడా ఆయన తప్పుకుంటున్నట్టు, శేష జీవితాన్ని తన భార్యాపిల్లలతో గడిపి తీర్థ యాత్రలు చేస్తాను అంటూ గతంలో ఆయన ఒక వీడియో ని విడుదల చేసాడు.
Also Read : రిమాండ్ ఖైదీకా వైసీపీకి మళ్లీ కనెక్ట్ అయిన పోసాని.. నెట్టింట ట్రోల్ చేస్తున్న టీడీపీ శ్రేణులు