Chhaava Movie : ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన ‘చావా'(Chhaava Movie) చిత్రం సృష్టించిన బాక్స్ ఆఫీస్ ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్(Chatrapathi Sambaji Maharaj) వీరోచిత పోరాటాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ అద్భుతంగా చూపించడంతో ఈ సినిమాకి నార్త్ ఇండియా లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ వీకెండ్ తో 500 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరనుంది. ఊపు చూస్తుంటే ఇప్పట్లో బాక్స్ ఆఫీస్ రన్ ఆగేలా లేదు, ఫుల్ రన్ లో 700 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతటి స్ట్రాంగ్ రన్ ని ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కనబరుస్తుంది. మార్చి 7వ తారీఖున ఈ చిత్రం తెలుగు లో కూడా విడుదల కాబోతుంది.
Also Read : యూట్యూబ్ ని ఊపేస్తున్న ‘చావా’ మేకింగ్ వీడియో..హీరో విక్కీ కౌశల్ కష్టాన్ని చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!
గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే ఒక చరిత్రకు సంబంధించిన ఒక సినిమా, ఇంత పెద్ద హిట్ అయ్యినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఎదురు అవుతూ ఉంటాయి. ఈ చిత్రానికి కూడా లేటెస్ట్ గా అలాంటి సమస్యనే ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రం లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ కి వెన్నుపోటు పొడిచి, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకి చిక్కేలా షిర్కే సోదరులు కుట్ర పన్నినట్టు చూపించారు. దీనిపై షిర్కే వంశస్తులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. తమ పూర్వికులు శంభాజీ మహారాజ్ కి ఎంతో విధేయులుగా ఉన్నారని, చరిత్రని వక్రీకరించి వాళ్ళను చెడుగా చూపించారని, తక్షణమే ఆ సన్నివేశాలు తొలగించాలని, లేకపోతే 100 కోట్ల రూపాయిల పరువు నష్టం దావా వేస్తామంటూ షిర్కే వంశస్తులు మేకర్స్ కి వార్నింగ్ ఇచ్చారు.
దీనిపై మూవీ టీం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే చరిత్ర ని ఆధారంగా చేసుకొనే ఈ సినిమాని తెరకెక్కించారు. షిర్కే సోదరులు శంభాజీ మహారాజ్ కి వెన్నుపోటు పొడిచి ఔరంగజేబుకి చిక్కేలా చేసారని చరిత్ర చెప్తుంది. దీనిపై మూవీ టీం బలంగా నిలబడితే షిర్కే కుటుంబ సభ్యుల పరువు నష్టం దావా చెల్లదు. కానీ కోర్టు వాళ్లకు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం మూవీ టీం కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందే. ఎందుకంటే ఛత్రపతి శివాజీ కాలం లో అనేక విషయాలపై పూర్తి స్థాయి అవగాహనా లేదు. ఔరంగజేబు ఎలా చనిపోయాడు అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ గా తెలియదు. అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం గురించి కూడా క్లారిటీ లేదు. కొంతమంది విషం పెట్టి చంపారు అంటారు, మరికొంతమంది సహజ మరణం అని అంటారు. సరైన ఆధారాలు లేవు కాబట్టి, షిర్కే వంశస్తులు చెప్పే మాటలను కోర్టు నమ్మే అవకాశాలు లేకపోలేదు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.