Posani Krishna Murali (5)
Posani Krishna Murali: సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసు(AP Police)లు కేసు నమోదు చేసి.. రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. హైదరాబాద్(Hyderabad)లోని అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu sudharreddy) పోసాని తరఫున వాదనలు వినిపించారు. గురువారం రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకూ ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా బీఎస్‌ఎస్ చట్టం 6పకారం పోసాని కృష్ణమురళికి 41ఏ నోటీసులు ఇచ్చి… బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. మారి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. దీంతో అతనికిని జరాజంపేట సబ్ జైలు(Rajampet Sub jail)కు తరలించారు. జైలు అధికారులు పోసానికి 2261 నంబర కేటాయించారు. దీంతో… టీడీపీ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. నెట్టింట్లో రెట్టింపు ట్రోలింగ్స్ చేస్తున్నారు.
Also Read: ఏపీ రాజకీయమే బూతు.. అందులో ఎవరూ అతీతులు కారు!
నాడు 23 నంబర్‌తో..
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ 23ని లింక్ చేస్తూ టీడీపీ నేతలపై వైసీపీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా కేటాయించిన ఖైదీ నెంబర్ 7691 ని కలిపి ట్రోల్ చేసేవారు.. 7+6+9+1 = 23 అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. అప్పట్లో ఈ 23 నంబర్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారేది. ఇదిలా ఉంటే..2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలిచింది. దీంతో.. రివేంజ్ తీర్చుకునే పనిలో తమ్ముళ్లు బిజీగా ఉన్నారని అంటున్నారు.
ఇప్పుడు 11 నంబర్ హాట్ టాపిక్..
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఏపీలో 11 నంబర్ హాట్ టాపిక్‌గా అయింది. వైసీపీ నేతలను కనెక్ట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు టీడీపీ నేతలు. పోసానికి జైల్లో రిమాండ్ ఖైదీ నంబర్ 2261 కేటాయించడంతో… 2+2+6+1 = 11 అంటూ సోషల్ మీడియా వేదికగా మొదలుపెట్టేశారు. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ తమ్ముళ్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
Also Read: ఏపీ బడ్జెట్.. అందరికీ ఆరోగ్య బీమా.. రూ.25 లక్షల వైద్య సేవలు!