Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని ( posani Krishna Murali) ఇప్పట్లో కేసులు విడిచి పెట్టేలా లేవు. 26 రోజులపాటు కస్టడీల మీద కస్టడీలు కొనసాగిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. వారంలో రెండు రోజులపాటు గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు పెడుతూ వెళ్తున్నారు పోసాని కృష్ణ మురళి. అయితే తాజాగా మరో కేసులో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో పోసాని ఎపిసోడ్ ఇంకా ముగియ లేదని.. మున్ముందు రిమాండ్ కు పంపినా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ వినిపిస్తోంది. మరోసారి ఆయన అరెస్టు తప్పదు అని ప్రచారం జరుగుతోంది.
Also Read: ఏపీకి బిగ్ అలెర్ట్.. ఆ జిల్లాలకు వర్ష సూచన!
* కూటమి వచ్చిన తర్వాత
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళి. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పోసాని కృష్ణ మురళి పై ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఉక్కు పాదం మోపుతోంది. అందులో భాగంగానే పోసాని కృష్ణ మురళి పై ఏపీవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన అరెస్టు కూడా జరిగింది. అయితే పోలీసులు కేసుల మీద కేసులు పెడుతూ పోసానిని రిమాండ్ లో ఉంచగలిగారు. దాదాపు 26 రోజులపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అయితే సిఐడి కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం, గురువారం మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే జైలు బాధ తగ్గిందని రిలాక్స్ మూడ్ లోకి వెళ్లారు పోసాని కృష్ణ మురళి. అయితే పిడుగు లాంటి వార్త చెప్పారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు సంతకం చేసేందుకు వచ్చిన పోసాని కృష్ణమురళీకి ఈనెల 15న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సూళ్లూరుపేట పోలీసులు.
* టీటీడీ చైర్మన్ పై కామెంట్స్..
అయితే ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన కామెంట్స్ పై కేసులు నమోదయ్యాయి పోసాని కృష్ణ మురళి పై. కానీ ఈసారి మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్ పై నోటీసులు ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ గా బీర్ నాయుడు( BR Naidu) ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎంపికను తప్పుపట్టారు పోసాని కృష్ణ మురళి. బిఆర్ నాయుడు ఎంపికను ఖండించారు.. అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో వచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ మురళీకృష్ణ పోసాని కృష్ణ మురళికి నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని చుట్టు మరోసారి వివాదం అలుముకుంది.
* ఫిబ్రవరి 26న అరెస్ట్..
ప్రకాశం జిల్లా( Prakasam district ) పోలీసులు ఫిబ్రవరి 26న హైదరాబాదులోని పోసాని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అక్కడ రిమాండ్ లో ఉండగానే వీటి వారెంట్ మీద పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు తరలించారు పోసానిని. అక్కడి కోర్టు రిమాండ్ కూడా విధించింది. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా 19 కి పైగా పోసాని కృష్ణమురళి పై కేసులు నమోదయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆయన మార్చి చివర్లో బెయిల్ పొందారు. అయితే ఇప్పుడు రిలాక్స్ గా ఉండగా మరోసారి సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇది కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ నోటీసులతో మరింత ఆందోళనకు గురవుతున్నారు పోసాని కృష్ణ మురళి.