Caste Politics: కులం( caste) అనేది చాలా ప్రభావితం చేస్తుంది. ఒక్క రాజకీయాలకే కాదు అన్నిచోట్ల కులం రాజ్యమేలుతూ వస్తోంది. అందునా తెలుగు రాష్ట్రాల్లో కులం అనేది ప్రధానం. టి అమ్మిన చోట కూడా కులం అనేది చూసే నైజం తెలుగు నాట విస్తృతం అయింది. అంటే ఏ స్థాయిలో కులం ప్రభావం ఉందో ఇట్టే చెప్పవచ్చు. అయితే ఎంతటి కులం అయినా పరిస్థితికి తగ్గట్టు నడుచుకోవాల్సి ఉండాల్సిందే. ఇప్పుడు తెలుగు నాట విభిన్నమైన కుల పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా కులం రాజకీయం ప్రభావం చూపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజించినా.. మూడు కులాల ప్రభావం విపరీతంగా ఉంది.
ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా..
ఏపీలో( Andhra Pradesh) సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయగలిగిందంటే దానికి ముమ్మాటికి కారణం కాపు సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని కాంగ్రెస్ దశాబ్దాల తరబడి రాజకీయం చేయగలిగింది. రెడ్డి సామాజిక వర్గానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి.. ఓటు బ్యాంకు పరంగా కాపులను వినియోగించుకుంది కాంగ్రెస్ పార్టీ. కేవలం కమ్మ సామాజిక వర్గం అనే బూచిని చూపించి చాలాసార్లు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది కూడా రెడ్డి సామాజిక వర్గం నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహా ఫార్ములాను అనుసరించింది. కానీ పవన్ నేతృత్వంలోని జనసేన రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారింది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. సామాజిక వర్గ సమతుల్యం భిన్నంగా ఉంది.
ఏపీలో కలిసి వచ్చిన సమీకరణాలు..
ఏపీలో కమ్మ( kamma caste ) సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఐక్యం కావడంతోనే కూటమికి ఏకపక్ష విజయం దక్కింది. అదే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గం ఐక్యం కావడంతో అక్కడ రేవంత్ రెడ్డికి తిరుగులేని నాయకత్వం లభించింది. 2014 తో పాటు 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది కాపు సామాజిక వర్గం. అయితే జనసేన బలమైన వాయిస్ వినిపించడంతో 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పవన్ వైపు టర్న్ అయింది. టిడిపి నేతృత్వంలోని కమ్మ సామాజిక వర్గంతో చేతులు కలిపింది. అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం మాత్రం అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం మాత్రం జగన్ తోనే ఉండిపోయింది. కానీ కాపు సామాజిక వర్గం అండతో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది.
తెలంగాణలో భిన్నం..
తెలంగాణలో( Telangana) ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంది. అక్కడ కమ్మ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఏకమయింది. వారికి కాపు సామాజిక వర్గం దోహదపడింది. రేవంత్ రెడ్డి టిడిపికి అత్యంత ఇష్టుడైన నాయకుడు. ఆపై చంద్రబాబుకు సన్నిహిత నేత. సహజంగానే అక్కడ కమ్మ సామాజిక వర్గం రేవంత్ రెడ్డికి జై కొట్టింది. అదే సమయంలో సొంత సామాజిక వర్గం నేత ముఖ్యమంత్రి హోదాకు వెళ్లడంతో రెడ్డి సామాజిక వర్గం సైతం ఏకీకృతం అయింది. వీటన్నింటికీ తోడు ఏపీలో కాపు సామాజిక వర్గం టిడిపికి అండగా నిలవడంతో ఆ ప్రభావం తెలంగాణ పై కూడా పడింది. అల్టిమేట్ గా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మూడు సామాజిక వర్గాలు జై కొట్టాయి. ఫలితంగా జూబ్లీహిల్స్ నాటి ఫలితం ఏకపక్షంగా వచ్చింది. అయితే ఇక్కడ ఒక వింత పరిస్థితిని గమనించవచ్చు. కెసిఆర్ గులాబీ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి అండగా నిలవవచ్చు కానీ.. రెడ్డి సామాజిక వర్గం మాత్రం ఆ పార్టీ వైపు వెళ్లలేదు. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రమే ఆ పార్టీ అడుగులు వేసింది. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తోంది. ఏపీ వరకు జగన్ ఓకే కానీ.. తెలంగాణలో ఆయన మిత్రుడు కేసీఆర్ ను ఎలా చేరదీస్తామన్నది రెడ్డి సామాజిక వర్గం ప్రశ్న. పైగా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గం. ఆపై కీలక మంత్రులు రెడ్డి సామాజిక వర్గం. అందుకే జగన్మోహన్ రెడ్డికి విభిన్నంగా.. కెసిఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పరిస్థితులు మారాయి. అందరూ ఏకమవడానికి కారణం అయ్యాయి.