Uttarandhra Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ దాదాపు స్వీప్ చేసినంత పని చేసింది. 34 అసెంబ్లీ స్థానాలకు గాను 28 చోట్ల గెలుపొందింది. టిడిపి ఆరు స్థానాలకు పరిమితం అయ్యింది.2014 ఎన్నికల్లో టిడిపి ఉత్తరాంధ్రలో 25 చోట్ల గెలుపొందింది. 9 స్థానాలకు వైసీపీ పరిమితం అయ్యింది. ఎన్నికల్లో మాత్రం హారహోరి ఫైట్ నడవనుందని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. అటు ఉత్తరాంధ్రలో పాగా వేయడానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈసారి సామాజిక సమీకరణలు ఫలితాలను మార్చే అవకాశం ఉంది. జనసేన వైపు తూర్పు కాపులు మొగ్గుచూపుతుండడంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసిపి, టిడిపి, జనసేన కూటమి మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. పరిస్థితి నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతోంది. టిడిపికి ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ నియోజకవర్గాలు అనుకూలంగా ఉన్నాయి. నరసన్నపేటలో వైసీపీకి మొగ్గు కనిపిస్తోంది. పలాసలో మాత్రం గట్టి ఫైట్ ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థి రామ్మోహన్ నాయుడు మరోసారి గెలుపొందే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
విజయనగరం జిల్లాకు సంబంధించి అధికార వైసిపికి చీపురుపల్లి, గజపతినగరం, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు అనుకూలంగా ఉన్నాయి. బొబ్బిలి, రాజాం, విజయనగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాలు టిడిపికి అనుకూలంగా నిలిచినట్లు తెలుస్తోంది. విజయనగరం పార్లమెంట్ స్థానం టిడిపి కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ గట్టి ఫైట్ ఉంటుంది. విశాఖ నగరంలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో టిడిపి, ఉత్తర నియోజకవర్గం లో వైసీపీకి అనుకూలంగా ఉంది. భీమిలి, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాలు టిడిపి, జనసేన కూటమికి అనుకూలంగా ఉంటాయి. మాడుగుల, అరకు, పాడేరులో వైసిపికి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. పాయకరావుపేటలో గట్టి ఫైట్ ఉంటుంది.విశాఖ, అనకాపల్లి పార్లమెంటు స్థానాలు టిడిపి, జనసేన కూటమికి, అరకు పార్లమెంట్ స్థానం వైసీపీకి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే అభ్యర్థుల మార్పు, ఎన్నికల వ్యూహాలకు అనుగుణంగా ఫలితాలు మారే అవకాశాలు ఉన్నాయి.