Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 13న ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఓ రాశివారికి సమాజంలో గౌరవం పెరుడుతుంది. మరో రాశి వారు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం. కటుుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఓ పని కోసం ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది.
వృషభ రాశి:
బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలోచించాలి.
మిథునం:
వ్యాపారులు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతారు. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసుకు నచ్చని పనులు చేయొద్దు. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.
కర్కాటకం:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సింహ:
వ్యాపారం కోసం ఇతరుల నుంచి డబ్బును ఆశిస్తారు. పెట్టుబడులు పెట్టేముందు ఇతరుల సలహాలు తీసుకోవాలి. ఓ సమాచారం నిరాశను కలిగిస్తుంది.
కన్య:
సోదరుల మద్దతు ఉంటుంది. కొన్ని డిమాండ్లను పరిష్కరిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారికి అనుకూల ఫలితాలు.
తుల:
కుటంబ సభ్యులపై కోపంతో ఉంటారు. పాత అప్పులు తీరుస్తారు. కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృశ్చికం:
సాధారణ ఖర్చులు ఉంటాయి. భవిష్యత్ కోసం కొంచెం డబ్బు కూడబెడుతారు. వివాహం కోసం ప్రతిపాదనలు చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
ధనస్సు:
విదేశీ వ్యాపారం చేసేవారికి అనుకూలం. ఓ వ్యక్తి నుంచి బహుమతిని పొందుతారు. మనసు తేలికగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
మకర:
కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. వివాదాల జోలికి పొవద్దు. ఆదాయం పెరుగుతుంది.
కుంభం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ఉల్లాసంగా జీవిస్తారు. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారుల పెట్టుబడులకు అనుకూల సమయం.
మీనం:
వ్యాపారులు పెట్టుబడులు పెట్టే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏ పని చేసినా ఏకాగ్రతతో ఉండాలి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ సభ్యులమద్దతు ఉంటుంది.