PM Modi: ప్రధాని మోదీ ఏపీ రానున్నారు.జనవరి 8న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయ్యింది. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టిపిసి, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి నవంబరులోనే ప్రధాని వీటికి శంకుస్థాపన చేస్తారని అంతా భావించారు. అందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఇంతలో తుఫాన్ రావడంతో వాయిదా పడింది ఆ కార్యక్రమం. నవంబర్ 29న ప్రధాని మోదీ పర్యటనను ఫిక్స్ చేశారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. కానీ తుఫాన్ కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా జనవరి 8న ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లా పర్యటన ఖాయమైంది.
* అధికారికంగా తొలిసారి
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొనడం ఇదే తొలిసారి. దేశానికి మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు మోది. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ హాజరయ్యారు. అయితే ఇప్పుడు తొలిసారిగా అధికారికంగా ఏపీలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన విధంగా భారీగా సన్నాహాలు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి లోకేష్ తో పాటు అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు.
* రైల్వే జోన్ కు సైతం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. సుమారు 85 వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నం ప్రతిష్ట కూడా మరింత పెరగనుంది. విశాఖను గ్రోత్ హబ్ గా ప్రకటించిన కేంద్రం.. దానికి సంబంధించి కార్యాచరణ చేపట్టింది. మరోవైపు ఏపీ ప్రజలకు పదేళ్లుగా ఊరిస్తూ వస్తున్న రైల్వే జోన్ కు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించబడింది. అయితే పదేళ్లు దాటుతున్న ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం, ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామ్యం కావడంతో కదలిక వచ్చింది. కాగా తాజాగా ఖరారైన ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి.. పూర్తి షెడ్యూల్ వెల్లడించారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pm modi visit to ap 85 thousand crore projects will be launched at the same time
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com