Tirumala: తిరుమల ప్లాన్ చేసుకోండిలా.. అందుబాటులో ఐఆర్సిటిసి ప్యాకేజీలు

రైలులో తిరుపతి చేరుకోవడానికి వీలుగా గోవిందం పేరుతో ఐఆర్సిటిసి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. రెండు రాత్రులు, మూడు పగళ్ళు ఈ ప్రయాణం కొనసాగుతోంది.

Written By: Dharma, Updated On : March 30, 2024 4:19 pm

Tirumala

Follow us on

Tirumala: సాధారణంగా వేసవి సెలవుల్లో తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్తుంటారు. ఆ సమయంలోనే పిల్లలకు సెలవులు ఉంటాయి కాబట్టి కుటుంబాలతో పయనమవుతారు. ప్రస్తుతం పది, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో చాలామంది తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. కొందరు ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకొని ఉంటారు. మరికొందరు ప్రత్యామ్నాయల కోసం అన్వేషిస్తుంటారు. అటువంటి వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి రైలు, విమాన ప్యాకేజీలను అందిస్తోంది. దర్శనం టికెట్లు సైతం అందించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించనుంది. హైదరాబాద్ తో పాటు విజయవాడ నుంచి ఈ టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.

రైలులో తిరుపతి చేరుకోవడానికి వీలుగా గోవిందం పేరుతో ఐఆర్సిటిసి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. రెండు రాత్రులు, మూడు పగళ్ళు ఈ ప్రయాణం కొనసాగుతోంది. ప్రతిరోజు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. గుంటూరు, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ దేశంలో ఈ రైలు ఎక్కొచ్చు. ఏప్రిల్ 5 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.3800 నుంచి టికెట్ ధరలు ప్రారంభమవుతాయి.

పూర్వ సంధ్య పేరుతో మరో టూర్ ప్యాకేజీని అందుబాటులోకి ఇచ్చారు. తిరుపతి తో పాటు శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూరు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు ప్రయాణం కొనసాగుతోంది. ప్రతిరోజు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. గుంటూరు, లింగంపల్లి, మిర్యాలగూడ,నల్గొండ, సికింద్రాబాద్ దేశంలో ఈ రైలు ఎక్కొచ్చు. ఏప్రిల్ 5 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ ధర రూ.5660 నుంచి ప్రారంభం అవుతుంది.

రెండు రోజుల్లోనే శ్రీవారి దర్శనాన్ని చేసుకుని ఇంటికి తిరుగు ముఖం పట్టే ప్యాకేజీ సైతం అందుబాటులోకి వచ్చారు. తిరుపతి బాలాజీ దర్శనం ప్యాకేజీ పేరిట విమాన టూర్ ప్యాకేజీల అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో తీసుకెళ్తారు. తిరుమల దర్శనం తర్వాత బస్సు మార్గంలో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాల దర్శనం ఉంటుంది. ఏప్రిల్ 11, 18, 25, 29 తేదీల ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధర రూ.15 వేల నుంచి ప్రారంభం అవుతుంది.

విజయ్ గోవిందం పేరుతో విజయవాడ నుంచి కూడా స్వామివారి దర్శనానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చారు. రెండు రాత్రులు, నాలుగు పగళ్ల ప్రయాణంతో ఐఆర్సిటిసి దర్శనం ప్యాకేజీ అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ 12 నుంచి ప్రతి శుక్రవారం శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలులో భక్తులను తరలించనున్నారు. విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, సామర్లకోట, తెనాలి స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు. టికెట్ ధర రూ.3800 నుంచి ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం టికెట్లు బుక్ చేసుకోండి.